జీ సినిమాలు ( 4th ఫిబ్రవరి )

Monday,February 03,2020 - 10:02 by Z_CLU

డోర

నటీనటులు : నయనతార, తంబి రామయ్య

ఇతర నటీనటులు హరీష్ ఉత్తమన్, షాన్, సులీల్ కుమార్, బేబీ యుక్త

మ్యూజిక్ డైరెక్టర్ దాస్ రామసామి

ప్రొడ్యూసర్ : A. సర్కునమ్, హితేష్ ఝబాక్

రిలీజ్ డేట్ : 31 మార్చి 2017

అమాయకురాలైన పారిజాతం(నయనతార) తన తండ్రి రామయ్య(తంబీ రామయ్య) తో కలిసి కాల్ టాక్సీ బిజినెస్ రన్ చేస్తుంటుంది. ఈ క్రమంలో పారిజాతం ఓ వింటేజ్ కార్ ను బిజినెస్ కోసం కొంటుంది. ఆ కారు వల్ల పారిజాతం జీవితంలో ఊహించని ఘటనలు వరుసగా జరుగుతుంటాయి. అసలు ఆ కారుకి పారిజాతానికి ఉన్న సంబంధం ఏంటి? చివరికి ఏమైంది..? ఇలాంటి కథలకు ఇంతకంటే ఎక్కువ రివీల్ చేస్తే సస్పెన్స్ ఉండదు. వెండితెర పై చూడాల్సిందే…

==============================================================================

బాబు బంగారం

నటీనటులు : వెంకటేష్నయనతార

ఇతర నటీనటులు : సంపత్ రాజ్మురళీ శర్మజయప్రకాష్బ్రహ్మానందంపోసాని కృష్ణ మురళి మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : జిబ్రాన్

డైరెక్టర్ : మారుతి

ప్రొడ్యూసర్ : S . నాగవంశీ, P . D . V .  ప్రసాద్

రిలీజ్ డేట్ : 12 ఆగష్టు 2016

తాత జాలిగుణం వారసత్వం గా అందుకున్న కృష్ణ (వెంకటేష్) అనే పోలీస్ ఆఫీసర్  జాలి గుణం తోనే జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. ఒకానొక సందర్భం లో తన లాగే జాలి గుణం తో ఉండే శైలు (నయనతార) ను చూసి ఇష్టపడతాడు కృష్ణ. ఇక తాను ప్రేమిస్తున్న శైలు కుటుంబానికి ఎం.ఎల్.ఏ పుచ్చప్ప (పోసాని),  మల్లేష్(సంపత్) లతో ఆపద ఉందని తెలుసుకున్న కృష్ణ  ఫామిలీ ను అలాగే శైలు నాన్న ను ఎలా కాపాడాడుచివరికి కృష్ణ  ఇద్దరి ఆట ఎలా కట్టించాడుఅనేది చిత్ర కధాంశం.

==============================================================================

అభినేత్రి

నటీనటులు : ప్రభు దేవాతమన్నాసోను సూద్అమీ జాక్సన్

ఇతర నటీనటులు : సప్తగిరిమురళి శర్మపృథ్వి

మ్యూజిక్ డైరెక్టర్ : సాజిద్ వాజిద్

డైరెక్టర్ :  ఎ.ఎల్.విజయ్

ప్రొడ్యూసర్ :  గణేష్ప్రభుదేవా

రిలీజ్ డేట్ అక్టోబర్ 7, 2016 

A.L. విజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన  సినిమాని మరికొందరు నిర్మాతలతో కలిసి ప్రభుదేవా స్వయంగా నిర్మించాడు. కథలో కాస్తయినా ఎక్సయింట్ మెంట్ లేకపోతే.. సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వదు తమన్న. హారర్ కాన్సెప్ట్ తో తెరకెక్కినప్పటికీ… ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సినిమా ఇది. మిల్కీ బ్యూటీని డ్యూయల్ రోల్ లో విభిన్నంగా ప్రెజెంట్ చేసిన  సినిమా ‘అభినేత్రి’.

==============================================================================

కథకళి

నటీనటులు : విశాల్, కేథరిన్ థెరిసా

ఇతర నటీనటులు : కరుణాస్, ఇమ్మన్ అన్నాచి, గ్రేస్ కరుణాస్, గోపీ, పవన్, మధుసూదన్ రావు మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : హిప్ హాప్ తమిళ

డైరెక్టర్ పాండిరాజ్

ప్రొడ్యూసర్ : పాండిరాజ్

రిలీజ్ డేట్ : 18 మార్చి 2016 

విశాల్, కేథరిన్ థెరిసా జంటగా నటించిన లవ్ & యాక్షన్ ఎంటర్ టైనర్ కథకళి. U.S. లో స్టడీస్ కంప్లీట్ చేసుకుని ఇండియాకి వచ్చిన కమల్ ( విశాల్ ) అనుకోకుండా, సాంబ అనే వ్యక్తి మర్డర్ కేస్ లో ఇరుక్కుంటాడు. కమల కుటుంబానికి, సాంబ కుటుంబానికి చాలా కాలం నుండి వ్యక్తిగత కక్షలుండటంతో పోలీసులు కమల్ ని అనుమానిస్తుంటారు. అయితే నిజానికి ఆ హత్య చేసింది ఎవరు…? అసలు హీరో ఫ్యామిలీకి, సాంబ ఫ్యామిలీకి మధ్య ఎందుకు చెడింది..? అనేది ఈ సినిమాలో ప్రధాన కథాంశం. హీరో విశాల్, కేథరిన్ థెరిసా కి మధ్య ఉండే రొమాంటిక్ ట్రాక్ సినిమాలో హైలెట్ గా నిలుస్తుంది.

==============================================================================

లింగ

నటీనటులు : రజినీకాంత్అనుష్క శెట్టిసోనాక్షి సిన్హా

ఇతర నటీనటులు : జగపతి బాబు, K. విశ్వనాథ్, N. సంతానంకరుణాకరన్దేవ్ గిల్ మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : A.R. రెహ్మాన్

డైరెక్టర్ : K.S. రవి కుమార్

ప్రొడ్యూసర్ : రాక్ లైన్ వెంకటేష్

రిలీజ్ డేట్ : 12 డిసెంబర్ 2014

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన డైరెక్ట్ సినిమా ‘లింగ’. రెండు డిఫరెంట్ బ్యాక్ డ్రాప్స్ ఓ ఉండే ఈ సినిమాలో రజినీకాంత్ డ్యూయల్ రోల్ ప్లే చేశాడు.  అనుష్కసోనాక్షి సిన్హా హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకి ఎ.ఆర్. రెహమాన్ మ్యూజిక్ అందించాడు.