
కోడిపుంజు
నటీనటులు : తనిష్, ఆంచల్, రోజా తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : అనూప్ రూబెన్స్
డైరెక్టర్: B.V.V. చౌదరి
ప్రొడ్యూసర్ : S.S. బుజ్జిబాబు
రిలీజ్ డేట్ : 22 జూలై 2011
________________________________________

వసంతం
నటీనటులు : వెంకటేష్, ఆర్తి అగర్వాల్, కళ్యాణి
ఇతర నటీనటులు : V.V.S. లక్ష్మణ్, ఆకాష్, సునీల్, చంద్ర మోహన్, తనికెళ్ళ భరణి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : S.A. రాజ్ కుమార్
డైరెక్టర్ : విక్రమన్
ప్రొడ్యూసర్ : N.V. ప్రసాద్
రిలీజ్ డేట్ : 11 జూలై 2003
స్నేహానికి, ప్రేమకు మధ్య డిఫెరెన్స్ ని అద్భుతంగా ఎలివేట్ చేసిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ వసంతం. ఎంత పెద్ద త్యాగానికైనా వెనకాడని ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కథే ఈ సినిమా. ఇమోషనల్ సీన్స్ సినిమాకి హైలెట్ గా నిలుస్తాయి.
_____________________________________

కోమాలి
రిలీజ్ డేట్ – 4 డిసెంబర్, 2020
నటీనటులు – జయం రవి, కాజల్ అగర్వాల్, యోగిబాబు
దర్శకుడు : ప్రదీప్ రంగనాథ్
సంగీత దర్శకుడు : హిప్ హాప్ తమిళ
సినిమాటోగ్రాఫర్ : రిచర్డ్ ఎం.నాథన్
నిర్మాత : ఐసరి కె.గణేష్
బ్యానర్ : అపోలో ప్రొడక్షన్స్
జయంరవి, కాజల్ హీరోహీరోయిన్లుగా నటించిన సూపర్ హిట్ మూవీ కోమాలి. 1999 డిసెంబర్ 31న యాక్సిడెంట్ కారణంగా కోమాలోకి వెళ్లిన రవి (జయం రవి) సరిగ్గా 16 ఏళ్ల తర్వాత కోమా నుంచి బయటకొస్తాడు. అప్పటికే ప్రపంచం మొత్తం మారిపోతుంది. ఈ సరికొత్త ప్రపంచంలో అతడు ఎలా నిలదొక్కుకున్నాడు? లోకల్ ఎమ్మెల్యే (కె.ఎస్.రవికుమార్) కారణంగా ఎదుర్కొన్న సమస్యలను ఎలా అధిగమించాడు అనేది క్లుప్తంగా “కోమాలి” కథాంశం. ఈ క్రమంలో రవికి కాజల్ ఎలా సహాయం చేసిందనేది స్టోరీ.
ఇందులో ‘జయం’ రవి, కాజల్ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటించగా.. సంయుక్తా హెగ్డే కీలక పాత్రలో కనిపించింది. ఇక కమెడియన్ యోగిబాబు, హీరో జయం రవి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను విపరీతంగా నవ్విస్తాయి. ఎమ్మెల్యేగా దర్శకుడు కె.ఎస్. రవికుమార్ విలన్ పాత్రలో కనిపిస్తారు. ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ‘హిప్ హాప్’ తమిజ్ సంగీతం అందించారు.
__________________________________

కథానాయకుడు
నటీనటులు : రజినీ కాంత్, జగపతి బాబు, మీనా, నయన తార
ఇతర నటీనటులు : మమత మోహన్ దాస్, ప్రభు, విజయ్ కుమార్, బ్రహ్మానందం, ఆలీ, సునీల్, M.S.నారాయణ
మ్యూజిక్ డైరెక్టర్ : G.V. ప్రకాష్ కుమార్
డైరెక్టర్ : P.వాసు
ప్రొడ్యూసర్ : C. అశ్విని దత్
రిలీజ్ డేట్ : 1 ఆగష్టు 2008
ఒక ఇమోషనల్ కథాంశంతో తెరకెక్కిందే కథానాయకుడు సినిమా. సూపర్ స్టార్ రజినీకాంత్ కి ఫ్రెండ్ గా నటించాడు జగపతి బాబు ఈ సినిమాలో. ఒక పెద్ద స్టార్ కి, ఒక మధ్య తరగతి సాధారణ వ్యక్తికి మధ్య ఉండే స్నేహానికి ప్రతిబింబమే ఈ కథా నాయకుడు. ఈ సినిమాకి P. వాసు డైరెక్టర్.
____________________________

భగీరథ
నటీనటులు : రవి తేజ, శ్రియ
ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, నాజర్, బ్రహ్మానందం తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : చక్రి
డైరెక్టర్ : రసూల్ ఎల్లోర్
ప్రొడ్యూసర్ :మల్లిడి సత్య నారాయణ రెడ్డి
రిలీజ్ డేట్ : అక్టోబర్ 13, 2005
రవి తేజ, శ్రియ హీరో హీరోయిన్స్ గా రసూల్ ఎల్లోర్ దర్శకత్వం లో తెరకెక్కిన సినిమా ‘భగీరథ’. ఈ సినిమాకు ప్రస్తుతం టాప్ డైరెక్టర్ గా గుర్తింపు అందుకున్న కిషోర్ కుమార్ పార్ధసాని (డాలీ) కథ ను అందించారు. కృష్ణ లంక అనే పల్లెటూరి లో జనాలు పడే ఇబ్బందులను ఓ యువకుడు ఎలా పరిష్కరించాడు అనే కథతో ఫామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా లో రవితేజ నటన, శ్రియ గ్లామర్, పల్లెటూరి సీన్స్, చక్రి పాటలు ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా రవి తేజ ప్రకాష్ రాజ్ మధ్య వచ్చే పోటా పోటీ సీన్స్ అందరినీ అలరిస్తాయి.
__________________________________

శివలింగ
నటీనటులు : రాఘవ లారెన్స్, రితిక సింగ్
ఇతర నటీనటులు : శక్తి వాసుదేవన్, రాధా రవి, వడివేలు, సంతాన భారతి మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : S.S. తమన్
డైరెక్టర్ : P. వాసు
ప్రొడ్యూసర్ : R. రవీంద్రన్
రిలీజ్ డేట్ : 14 ఏప్రియల్ 2017
ట్రైన్ లో ప్రయాణిస్తూ హఠాత్తుగా చనిపోయిన రహీం(శక్తి) కేస్ ను ఇంటరాగేషన్ చేయమని పవర్ ఫుల్ సీబీ-సీఐడీ ఆఫీసర్ శివలింగేశ్వర్(లారెన్స్) కు అప్పజెప్తారు కమిషనర్.. అలా కమిషనర్ ఆర్డర్ తో రహీం కేసును టేకప్ చేసిన శివలింగేశ్వర్ తన భార్య సత్యభామ(రితిక సింగ్)తో కలిసి వరంగల్ కి షిఫ్ట్ అవుతాడు. అలా రహీం కేసు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించిన లింగేశ్వర్ ఆ కేసులో ఎలాంటి నిజాలు తెలుసుకున్నాడు..? చనిపోయిన రహీం బ్యాక్ గ్రౌండ్ ఏంటి.. ఫైనల్ గా శివలింగేశ్వర్ ఏం చేశాడు.. అనేది సినిమా కథాంశం.