Laxmi Rai - షూటింగ్ లో యాక్సిడెంట్

Tuesday,March 23,2021 - 01:51 by Z_CLU

తెలుగు సినిమా షూటింగ్ లో రాయ్‌లక్ష్మీకి ప్రమాదం..
సాధారణంగా సినిమా చిత్రీకరణలో ఫైట్‌ స్వీకెన్స్ లో హీరోలు తరచుగా ప్రమాదాల బారిన పడి గాయలపాలవుతుంటారు. అయితే ఇందుకు భిన్నంగా తాజాగా *ప్రముఖ కథానాయిక రాయ్‌లక్ష్మీ ఫైట్స్‌ షూటింగ్ లో పాల్గొని స్వల్ప గాయాలతో బయటపడింది. పెనుప్రమాదం నుంచి ఎడ్జ్ లో తప్పించుకుంది.

హీరోయిన్ రాయ్‌లక్ష్మీ ప్రధాన పాత్రలో తెలుగులో ఓ వైవిధ్యమైన చిత్రం రూపొందుతుంది. రోచిశ్రీ మూవీస్‌ నిర్మాణంలో రమణ మొగిలి దర్శకత్వంలో రూపొందుతన్న ఈ చిత్రం షూటింగ్‌ ఇటీవల హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ షూటింగ్‌లో రాయ్‌లక్ష్మీ, విలన్‌లు ప్రదీప్‌రావత్‌, సీనియర్‌ నటుడు సురేష్‌, ఇతర 18 మంది ఫైటర్స్‌తో అండర్‌వాటర్‌ లో భారీగా చిత్రీకరిస్తున్న యాక్షన్‌ సీక్వెన్సీలో లక్ష్మీరాయ్‌కి కాలికి గాయమైంది.

వెంటనే ఆమెను హైదరాబాద్ లోని ఓ కార్పొరేట్ హాస్పటల్‌లో అడ్మిట్ చేశారు. చికిత్స పొందిన అనంతరం ఆమె క్షేమంగా, పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జ్‌ అయింది. కొన్ని రోజులు రెస్ట్ తీసుకొని, త్వరలోనే ఆమె సెట్స్ పైకి వస్తుంది.

laxmi rai accident 1 laxmi rai accident 1