సంకల్ప్ రెడ్డి.. ఈసారి మరో కొత్త కాన్సెప్ట్

Tuesday,January 22,2019 - 09:36 by Z_CLU

ఘాజి సినిమాతో తన దారేంటో చెప్పేశాడు. అంతరిక్షం సినిమాతో అది మరోసారి రుజువు చేశాడు. ఇప్పుడు ఈ రెండు సినిమాల దారిలోనే ముచ్చటగా మూడో సినిమాకు రెడీ అవుతున్నాడు సంకల్ప్ రెడ్డి. ఈసారి ఇంకాస్త కొత్త కాన్సెప్ట్ ను తెరపై చూపించబోతున్నాడు ఈ విలక్షణ దర్శకుడు.

ఘాజి సినిమాను సముద్రం అట్టడుగున, అంతరిక్షం సినిమాను స్పేస్ లో తీసిన సంకల్ప్… తన మూడో సినిమాకు మంచును నేపథ్యంగా తీసుకున్నాడు. ఓ తెలుగు కుర్రాడు ఇండియా నుంచి అంటార్కిటాకు ఎలా వెళ్లాడు.. అక్కడున్న రీసెర్చ్ సెంటర్ లో ఎలా జాయిన్ అయ్యాడనే కాన్సెప్ట్ ను తన నెక్ట్స్ సినిమాకు సెలక్ట్ చేసుకున్నాడు సంకల్ప్.

మొదటి రెండు సినిమాలకు సెట్స్ వేసి పనికానిచ్చేశాడు సంకల్ప్. ఎందుకంటే ఘాజి, అంతరిక్షం సినిమా పని మొత్తం సెట్స్, గ్రాఫిక్స్ పైనే నడిచింది. కానీ తాజా సినిమాకు సెట్స్ పనికిరావు. గ్రాఫిక్స్ తో పనిలేదు. అందుకే ఈ సినిమా కోసం ఏకంగా అంటార్కిటికాలో షూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు ఈ దర్శకుడు.