
లక్కున్నోడు
నటీనటులు : మంచు విష్ణు, హన్సిక మోత్వాని
ఇతర నటీనటులు : తనికెళ్ళ భరణి, వెన్నెల కిషోర్, పోసాని కృష్ణ మురళి, ప్రభాస్ శ్రీను, సత్య రాజేష్
మ్యూజిక్ డైరెక్టర్ : అచ్చు, ప్రవీణ్ లక్కరాజు
డైరెక్టర్ : రాజ కిరణ్
ప్రొడ్యూసర్ : M.V.V. సత్య నారాయణ
చిన్నతనం నుంచి లక్ వెంట తెచ్చి అంతలోనే అన్ లక్ ను దూరం చేసే లక్కీ(విష్ణు) ని అన్ లక్కీగా భావించి దూరం పెడతాడు లక్కీ తండ్రి భక్త వత్సల. ఇక ఉద్యోగ అవకాశం కోసంహైదరాబాద్ వచ్చిన లక్కీ కి పాజిటీవ్ గా ఆలోచించే పద్మ(హన్సిక ) పరిచయం అవుతుంది. తొలి చూపులోనే పద్మ ను చూసి ప్రేమలో పడిన లక్కీ పద్మ ను ఎలా దక్కించుకున్నాడు? ఈక్రమంలో తన అన్ లక్ కి కారణమైన జె.కె(ఎం.వి.వి.సత్యనారాయణ)ను ఎలా ఎదుర్కున్నాడు? చివరిగా 25 ఏళ్ళు దూరమైన తన తండ్రికి మళ్ళీ ఎలా దగ్గరయ్యాడు? అనేది సినిమాకథాంశం.
==============================================================================

అఖిల్
నటీనటులు : అఖిల్ అక్కినేని, సాయేషా సైగల్
ఇతర నటీనటులు : రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, సప్తగిరి, హేమ, మహేష్ మంజ్రేకర్, వెన్నెల కిషోర్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : అనూప్ రూబెన్స్, S.S. తమన్
డైరెక్టర్ : V.V.వినాయక్
ప్రొడ్యూసర్ : సుధాకర్ రెడ్డి, నితిన్
రిలీజ్ డేట్ : నవంబర్ 11, 2015
అక్కినేని అఖిల్ డెబ్యూ ఫిల్మ్ అఖిల్. సాయేషా హీరోయిన్ గా నటించింది. పక్కా రొమాంటిక్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా, రిలీజైన అన్ని థియేటర్ లలోను సూపర్ హిట్టయింది. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాని వి.వి. వినాయక్ దర్శకత్వం వహించాడు. అఖిల్ ఆఫ్రికాలో జాగ్వార్ తో చేసే ఫైట్ హైలెట్ గా నిలుస్తుంది.
==============================================================================

బాలు
హీరో హీరోయిన్లు : పవన్ కళ్యాణ్, శ్రియ శరన్, నేహ ఒబెరాయ్
ఇతర నటీనటులు : గుల్షన్, సుమన్, జయసుధ, తనికెళ్ళ భరణి, సునీల్, బ్రహ్మానందం, ఎం.ఎస్.నారాయణ తదితరులు
సంగీతం : మణిశర్మ
దర్శకత్వం : కరుణాకరన్
నిర్మాత : అశ్విని దత్
విడుదల తేది : 6 జనవరి 2015
తొలి ప్రేమ తర్వాత పవన్ కళ్యాణ్ -కరుణాకరన్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా ‘బాలు‘. వైజయంతి మూవీస్ బ్యానర్ పై రూపొందిన ఈ సినిమా పవన్ కళ్యాణ్ ను ఓ కొత్త కోణంలో ఆవిష్కరించింది. అటు చలాకీ కుర్రాడిగా ఎంటర్టైన్ చేస్తూనే మరో వైపు యాక్షన్ ఎపిసోడ్స్ లో అదరగొట్టేసాడు పవర్ స్టార్. మణిశర్మ అందించిన పాటలు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు హైలైట్.
=============================================================================

ముత్తు
నటీనటులు : రజినీకాంత్, మీనా
ఇతర నటీనటులు : రఘువరన్, శరత్ బాబు, జయ భారతి, వడివేలు, కాంతిమతి, రాధా రవి మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : A.R. రెహమాన్
డైరెక్టర్ : K.S. రవికుమార్
ప్రొడ్యూసర్ : రాజం బాలచందర్
రిలీజ్ డేట్ : 23 అక్టోబర్ 1995
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన ముత్తు సెన్సేషనల్ హిట్ అయింది. రాకుమారుడైన ముత్తు, అతని కుటుంబ సభ్యులు చేసిన కుట్ర వల్ల పనివాడిలా పెరుగుతాడు. పెరిగి పెద్దవాడైన ముత్తు తన అధికారాన్ని ఎలా సాధించుకున్నాడు. అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం.
==============================================================================

రాక్షసుడు
నటీనటులు : సూర్య, నయనతార
ఇతర నటీనటులు : ప్రేమ్గీ అమరేన్, ప్రణీత సుభాష్, ప్రతిభాన్, రియాజ్ ఖాన్, సముథిరఖని, శరత్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : యువన్ శంకర్ రాజా
డైరెక్టర్ : వెంకట్ ప్రభు
ప్రొడ్యూసర్ : K.E. జ్ఞానవేల్ రాజా
రిలీజ్ డేట్ : 29 మే 2015
సూర్య కరియర్ లోనే డిఫెరెంట్ సినిమాగా నిలిచింది రాక్షసుడు. సూర్య డ్యూయల్ రోల్ లో నటించిన ఈ సినిమా అటు తమిళం లోను, తెలుగులోనూ బ్లాక్ బస్టర్ అయింది. ఆత్మగా నటించిన సూర్య పర్ఫామెన్స్ సినిమాకే హైలెట్ గా నిలిచింది. నయనతార ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది.
==============================================================================

బ్రదర్ అఫ్ బొమ్మాళి
నటీనటులు : అల్లరి నరేష్, కార్తీక, మోనాల్ గజ్జర్
ఇతర నటీనటులు : హర్ష వర్ధన్ రాణే, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : శేఖర్ చంద్ర
డైరెక్టర్ : చిన్ని కృష్ణ
ప్రొడ్యూసర్ : అమ్మి రాజు కనిమిల్లి
రిలీజ్ డేట్ : నవంబర్ 7 , 2014
కామెడీ కింగ్ అల్లరి నరేష్ హీరోగా , కార్తీక, మోనాల్ గజ్జర్ ఇతర పాత్రల్లో నటించిన కామెడీ ఎంటర్టైనర్ ‘బ్రదర్ అఫ్ బొమ్మాలి’. ఈ సినిమా లో అల్లరిగా నరేష్ అక్కగా కార్తీక యాక్టింగ్ అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది. కోన వెంకట్ గా బ్రహ్మానందం కామెడీ, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి కామెడీ సీన్స్ కడుపుబ్బా నవ్విస్తాయి. అల్లరి నరేష్ ఎనర్జీ తో కూడిన ఫన్నీ పెరఫార్మెన్స్, శేఖర్ చంద్ర మ్యూజిక్, కామెడీ సీన్స్ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్స్.