రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న "టాక్సీవాలా"

Sunday,October 21,2018 - 09:12 by Z_CLU

పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం చిత్రాలతో కమర్షియల్ స్టామినా ఉన్న స్టార్ హీరోగా ఎదిగిన విజ‌య్‌ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ ‘టాక్సీవాలా’.. జిఏ2 పిక్చ‌ర్స్ మ‌రియు యు.వి. క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాను నవంబర్ 16 గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేసారు.

రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అద్భుతమైన గ్రాఫిక్స్ తో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తుందంటున్నారు మేకర్స్.. సస్పెన్స్, సైంటిఫిక్ థ్రిల్లర్ కథాంశంతో హిలేరియస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది.