జీ సినిమాలు ( 21st అక్టోబర్ )

Sunday,October 20,2019 - 10:04 by Z_CLU

అఖిల్

నటీనటులు : అఖిల్ అక్కినేని, సాయేషా సైగల్

ఇతర నటీనటులు : రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, సప్తగిరి, హేమ, మహేష్ మంజ్రేకర్, వెన్నెల కిషోర్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్, S.S. తమన్

డైరెక్టర్ : V.V.వినాయక్

ప్రొడ్యూసర్ : సుధాకర్ రెడ్డి, నితిన్

రిలీజ్ డేట్ : నవంబర్ 11, 2015

అక్కినేని అఖిల్ డెబ్యూ ఫిల్మ్ అఖిల్. సాయేషా హీరోయిన్ గా నటించింది. పక్కా రొమాంటిక్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా, రిలీజైన అన్ని థియేటర్ లలోను  సూపర్ హిట్టయింది. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాని వి.వి. వినాయక్ దర్శకత్వం వహించాడు. అఖిల్ ఆఫ్రికాలో జాగ్వార్ తో చేసే ఫైట్ హైలెట్ గా నిలుస్తుంది.

=============================================================================


హలో

నటీనటులు అఖిల్ అక్కినేని, కళ్యాణి ప్రియదర్శన్

ఇతర నటీనటులు : జగపతి బాబు, రమ్యకృష్ణ, అజయ్, సత్య కృష్ణన్, అనీష్ కురువిల్ల మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : అనూప్ రూబెన్స్

డైరెక్టర్ : విక్రమ్ కుమార్

ప్రొడ్యూసర్ : నాగార్జున అక్కినేని

రిలీజ్ డేట్ : 22 డిసెంబర్ 2017 

చిన్నతనంలో తల్లితండ్రులకు కోల్పోయి అనాధగా ఉన్న శీను(అఖిల్)కి స్నేహితురాలుగా పరిచయం అవుతుంది జున్ను(కల్యాణి). అలా అనుకోకుండా ఒక్కటైన శీను, జున్ను కొన్ని రోజులకే విడిపోతారు. అనాధగా ఉన్న శీనుని ఒకానొక పరిస్థితుల్లో అవినాష్ గా పేరు మార్చి దత్తత తీసుకొని పెంచి పెద్ద చేస్తారు సరోజిని(రమ్యకృష్ణ)- ప్రకాష్(జగపతి బాబు). అలా పెరిగి పెద్దవాడైన అవినాష్ కు 15 ఏళ్ళ తర్వాత తన ప్రియురాలిని కలిసే అవకాశం వస్తుంది. అయితే తన ప్రేయసిని కలవడానికి ఒకే ఒక్క ఆధారమైన ఫోన్ పోగొట్టుకుంటాడు. ఇంతకీ అవినాష్ ఫోన్ దొంగలించింది ఎవరు? అవినాష్ – ప్రియగా పేర్లు మార్చుకున్న వీరిద్దరూ చివరికి ఎలా కలిశారు.. అనేది సినిమా స్టోరీ.

==============================================================================

చినబాబు
నటీనటులు : కార్తీ, సాయేషా
ఇతర నటీనటులు : సత్యరాజ్, ప్రియా భవానీ శంకర్, అర్ధన బిను, సూరి, భానుప్రియ, విజి చంద్రశేఖర్, సరోజా, మౌనిక తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : D. ఇమ్మన్
డైరెక్టర్ : పాండిరాజ్
ప్రొడ్యూసర్ సూర్య
రిలీజ్ డేట్ : 13 జూలై 2018
రుద్రరాజు(సత్య రాజ్)ది పెద్ద కుటుంబం. ఇద్దరు భార్యలు, ఆరుగురు సంతానం. ఐదుగురు అమ్మాయిల తర్వాత మగ పిల్లాడి కోసం ఎదురుచూస్తున్న వేళ ఆఖరివాడుగా కృష్ణంరాజు(కార్తి) పుడతాడు. అందుకే చినబాబు అవుతాడు. పొలం బాధ్యతలతో పాటు కుటుంబాన్ని కూడా చూసుకుంటాడు చినబాబు. వ్యవసాయం అనేది వృతి కాదు… జీవన విధానం అని నమ్మే చినబాబు పల్లెటూళ్ల నుండి సిటీకెళ్ళిన వాళ్లంతా ఎప్పటికైనా సొంత ఊరిలో రైతులుగా స్థిరపడాలనే లక్ష్యంతో రైతుగా జీవితాన్ని కొనసాగిస్తుంటాడు. ఈ క్రమంలో జాలీ సోడా యజమాని నీల నీరధ(సాయేషా)ను తొలిచూపులోనే ప్రేమిస్తాడు.
కానీ చినబాబు అక్కయ్యలకు వయసుకు వచ్చిన ఇద్దరు కూతుర్లుంటారు. మేనమామగా మరదళ్లను చిన్నతనం నుండి అల్లారుముద్దుగా చూసుకుంటాడు. అయితే తనకు నచ్చిన అమ్మాయిని కాకుండా తమ కూతురునే పెళ్లి చేసుకోవాలని చినబాబుతో గొడవకు దిగుతారు ఇద్దరు అక్కలు.
మరోవైపు కులరాజకీయాలు నడుపుతూ ఊరిలో పెద్దమనిషిగా ఉండే సురేందర్ రాజు(శత్రు)ని ఒక స్టూడెంట్ హత్య కేసులో జైలుకు పంపిస్తాడు చినబాబు. పగబట్టిన సురేందర్ రాజు చినబాబుని చంపే ప్రయత్నాల్లో ఉంటాడు. చినబాబు పెళ్ళి మేటర్ తో కుటుంబంలో కలతలొస్తాయి. మరి చినబాబు తన అక్కయ్యలను ఒప్పించి తను ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడా… 
చివరికి సురేందర్ రాజు నుంచి ఎలా తప్పించుకున్నాడు… కుటుంబం మొత్తాన్ని ఎలా కలిపాడనేది మిగతా కథ…

==============================================================================

సైనికుడు
నటీనటులు : మహేష్ బాబు, త్రిష కృష్ణన్
ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, ఇర్ఫాన్ ఖాన్, కామ్న జెఠ్మలాని, కోట శ్రీనివాస రావు, రవి వర్మ అజయ్
మ్యూజిక్ డైరెక్టర్ : హారిస్ జయరాజ్
డైరెక్టర్ : గుణశేఖర్
ప్రొడ్యూసర్ :  అశ్విని దత్
రిలీజ్ డేట్ :  1 డిసెంబర్ 2006
మహేష్ బాబు కరియర్ లో సైనికుడు సినిమా ప్రత్యేకమైనది. రాజకీయ అవినీతి పరులపై ఒక యువకుడు చేసిన పోరాటమే సైనికుడు. క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కోసం సరికొత్త టెక్నాలజీని వాడారు. త్రిష అమాయకత్వపు నటన సినిమాకే హైలెట్. హారిస్ జయరాజ్ ప్రతి పాట బావుంటుంది.

============================================================================

ఉన్నది ఒకటే జిందగీ

నటీనటులు : రామ్ పోతినేని, అనుపమ పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠి

ఇతర నటీనటులు : శ్రీ విష్ణు, ప్రియదర్శి, కిరీటి దామరాజు, హిమజ, అనీషా ఆంబ్రోస్ మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్

డైరెక్టర్ : కిషోర్ తిరుమల

ప్రొడ్యూసర్ కృష్ణ చైతన్య, స్రవంతి రవి కిషోర్

రిలీజ్ డేట్ : 27 అక్టోబర్ 2017

అభి(రామ్) – వాసు(శ్రీ విష్ణు) ఒకరిని వదిలి ఒకరు ఉండలేని ప్రాణ స్నేహితులు.  చిన్నతనం నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ గా  జీవితాన్ని గడుపుతున్న అభి – వాసు జీవితంలోకి  అనుకోకుండా మహా(అనుపమ) అనే అమ్మాయి ఎంటర్ అవుతుంది.  స్నేహితుడు తర్వాతే ఇంకెవరైనా అనుకునే అభి- వాసులు మహా వల్ల నాలుగేళ్లు  దూరమవుతారు. ఇంతకీ మహా ఎవరు…? ఒకరినొకరు వదిలి ఉండలేని అభి – వాసులు ఎందుకు విడిపోయారు.. చివరికి మళ్ళీ ఎలా కలిశారు..అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

==============================================================================

చింతకాయల రవి
నటీనటులు : వెంకటేష్, అనుష్క శెట్టి
ఇతర నటీనటులు : మమత మోహన్ దాస్, వేణు తొట్టెంపూడి, శయాజీ షిండే, చంద్ర మోహన్, బ్రహ్మానందం, సునీల్, ఆలీ మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : విశాల్ – శేఖర్
డైరెక్టర్ : యోగి
ప్రొడ్యూసర్ : నల్లమలుపు బుజ్జి
రిలీజ్ డేట్ : 2 అక్టోబర్ 2008
చింతకాయల రవి USA లో ఒక బార్ లో పని చేస్తుంటాడు. ఇండియాలో ఉండే తన తల్లికి మాత్రం అమెరికాలో పెద్ద సాఫ్ట్ ఇంజినీర్ అని చెప్పుకుంటాడు. ఈ లోపు రవి మదర్, రవికి పెళ్ళి చేద్దామనుకునే ప్రాసెస్ లో సంబంధం చూసి ఫిక్స్ చేస్తుంది. అటు వైపు పెళ్ళి కూతురు ఫ్యామిలీ రవి ఎలాంటి వాడో తెలుసుకోవాలనే ఉద్దేశంతో సునీతను ఎంక్వైరీ చేయమని చెప్తారు. ఆ తరవాత ఏం జరుగుతుంది…? రవి సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కాదని తెలుసుకున్న సునీత ఏం చేస్తుంది..? ఆ తరవాత కథ ఏ మలుపు తిరుగుతుంది అనేది జీ సినిమాలు లో చూడాల్సిందే.