మాస్ మహారాజ్ కొత్త ఫార్ములా

Thursday,March 19,2020 - 03:47 by Z_CLU

బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయడమే కాదు.. బ్యాక్ టు బ్యాక్ హీరోయిన్లను కూడా రిపీట్ చేసే కార్యక్రమం పెట్టుకున్నాడు రవితేజ. ప్రస్తుతం చేస్తున్న సినిమాతో పాటు.. త్వరలోనే సెట్స్ పైకి రాబోతున్న మరో 2 సినిమాల్లో తన పాత హీరోయిన్లనే మళ్లీ రిపీట్ చేస్తున్నాడు.

ప్రస్తుతం క్రాక్ అనే సినిమా చేస్తున్నాడు మాస్ రాజా. ఇందులో శృతిహాసన్ హీరోయిన్. ఇంతకుముందు వీళ్లిద్దరి కాంబినేషన్ లో బలుపు అనే సినిమా వచ్చింది.

ఈ మూవీ తర్వాత రమేష్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తాడు రవితేజ. ఇందులో హీరోయిన్ గా మాళవిక శర్మను తీసుకున్నారు. ఇంతకుముందు వీళ్లిద్దరి కాంబోలో నేలటిక్కెట్ అనే సినిమా వచ్చింది.

రమేష్ వర్మ సినిమాతో పాటు త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు రవితేజ. ఈ సినిమాలో హీరోయిన్ గా తమన్నను తీసుకునే ఆలోచనలో ఉన్నారు. ఇంతకుముందు మాస్ రాజా-మిల్కీ బ్యూటీ కాంబోలో బెంగాల్ టైగర్ వచ్చింది.

ఇలా హీరోయిన్లను వరుసగా రిపీట్ చేస్తున్నాడు రవితేజ.