జీ సినిమాలు ( 20th జనవరి )

Saturday,January 19,2019 - 10:03 by Z_CLU

త్రిపుర

నటీనటులు : స్వాతి రెడ్డినవీన్ చంద్ర

ఇతర నటీనటులు : రావు రమేష్సప్తగిరిశివన్నారాయణ నడిపెద్దిజయ ప్రకాష్ రెడ్డిప్రీతీ నిగమ్ మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : కామ్రాన్

డైరెక్టర్ రాజ్ కిరణ్

ప్రొడ్యూసర్స్ : A. చినబాబు & రాజశేఖర్

రిలీజ్ డేట్ : 6 నవంబర్ 2015

స్వాతి లీడ్ రోల్ ప్లే చేసిన త్రిపుర పర్ఫెక్ట్ ఇమోషనల్ హారర్ థ్రిల్లర్. పల్లెటూరిలో పెరిగిన త్రిపురకు చిన్నప్పటి నుండి తన చుట్టూ పక్కల జరగబోయే ఇన్సిడెంట్స్ గురించి కలలు వస్తుంటాయి. అవి కాస్తా నిజమవుతుంటాయి. దాంతో త్రిపురకు ట్రీట్ మెంట్ కోసమని సిటీకి తీసుకువస్తారు. అక్కడ నవీన్ చంద్రత్రిపురలు ప్రేమలో పడతారుపెళ్ళి కూడా చేసేసుకుంటారు.  తరవాత ఏం జరుగుతుందనేదే సినిమా ప్రధాన కథాంశం. సస్పెన్స్ ఎలిమెంట్ సినిమాలో హైలెట్ గా నిలుస్తుంది.

=============================================================================

రాఖీ

నటీనటులు : NTR, ఇలియానా, చార్మి

ఇతర నటీనటులు : సుహాసిని, రవి వర్మ, ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాస రావు, చంద్ర మోహన్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్

డైరెక్టర్ : కృష్ణవంశీ

ప్రొడ్యూసర్ : K.L. నారాయణ

రిలీజ్ డేట్ : 22 డిసెంబర్ 2006

NTR, కృష్ణవంశీ కాంబినేషన్ లో తెరకెక్కిన రాఖీ ఇద్దరి కరియర్ లోను డిఫరెంట్ సినిమా. ఆడపిల్లలపై జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా ఒక యువకుడు చట్టాన్ని తన చేతిలోకి తీసుకుని పోరాటం చేయడమే రాఖీ సినిమా ప్రధానాంశం. ఈ సినిమాలో ఛార్మి నటన హైలెట్.

==============================================================================

భీమవరం బుల్లోడు

నటీనటులు : సునీల్ఎస్తర్ నోరోన్హా

ఇతర నటీనటులు : విక్రమ్ జీత్ విర్క్సాయాజీ షిండేరఘుబాబుసుబ్బరాజుసత్య రాజేష్తెలంగాణ శకుంతల మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : అనూప్ రూబెన్స్

డైరెక్టర్ : ఉదయ్ శంకర్

ప్రొడ్యూసర్ : D. సురేష్ బాబు

రిలీజ్ డేట్ : 27 ఫిబ్రవరి 2014

తనకు బ్రెయిన్ ట్యూమర్ ఉండటంతో ఇంకా ఎన్నో రోజులు బ్రతకనని తెలుసుకున్న రాంబాబుఆ మిగిలిన కొన్ని రోజులు సొసైటీలో చేంజ్ తీసుకురావడం  కోసం స్పెండ్ చేయాలనుకుంటాడు. అల్టిమేట్ గా తన చుట్టూరా జరుగుతున్న రౌడీయిజాన్ని అంతం చేయాలనుకుంటాడు. ఈ ప్రాసెస్ లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటాడు. తీరా కొన్ని రోజుల తరవాత తన ప్రాణాలకు ఏ ఆపద లేదనిఅసలు తనకు బ్రెయిన్ ట్యూమరే లేదని తెలుస్తుంది రాంబాబుకి. ఆ తర్వాత రాంబాబు ఏం చేస్తాడు..మళ్ళీ మునుపటిలాగే సాధారణంగా బ్రతికేస్తాడా..సొసైటీ కోసం తను చేసే పోరాటాన్ని కంటిన్యూ చేస్తాడా..అనేదే సినిమాలోని ప్రధాన కథాంశం.

==============================================================================

యోగి

నటీనటులు : ప్రభాస్నాయన తార

ఇతర నటీనటులు : కోట శ్రీనివాస రావుప్రదీప్ రావత్సుబ్బరాజుఆలీ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ రమణ గోగుల

డైరెక్టర్ : V.V. వినాయక్

ప్రొడ్యూసర్ : రవీంద్ర నాథ్ రెడ్డి

రిలీజ్ డేట్ : 12 జనవరి 2017

ప్రభాస్ హీరోగా V.V. వినాయక్ డైరెక్షన్ లో తెరకెక్కిన హై ఎండ్ ఇమోషనల్ ఎంటర్ టైనర్ యోగి. నయనతార హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో ఊర్వశి శారద ప్రభాస్ కి తల్లిగా నటించారు. ఈ ఇద్దరి మధ్యన నడిచే ఇమోషనల్ సీన్స్ సినిమాకి హైలెట్ గా నిలిచాయి.

=============================================================================

బ్రదర్ అఫ్ బొమ్మాళి

నటీనటులు : అల్లరి నరేష్, కార్తీక, మోనాల్ గజ్జర్

ఇతర నటీనటులు : హర్ష వర్ధన్ రాణే, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : శేఖర్ చంద్ర

డైరెక్టర్ : చిన్ని కృష్ణ

ప్రొడ్యూసర్ : అమ్మి రాజు కనిమిల్లి

రిలీజ్ డేట్ : నవంబర్ 7 , 2014

కామెడీ కింగ్ అల్లరి నరేష్ హీరోగా , కార్తీక, మోనాల్ గజ్జర్ ఇతర పాత్రల్లో నటించిన కామెడీ ఎంటర్టైనర్ బ్రదర్ అఫ్ బొమ్మాలి’. ఈ సినిమా లో అల్లరిగా నరేష్ అక్కగా కార్తీక యాక్టింగ్ అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది.  కోన వెంకట్ గా బ్రహ్మానందం కామెడీ, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి కామెడీ సీన్స్ కడుపుబ్బా నవ్విస్తాయి. అల్లరి నరేష్ ఎనర్జీ తో కూడిన ఫన్నీ  పెరఫార్మెన్స్, శేఖర్ చంద్ర మ్యూజిక్, కామెడీ సీన్స్ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్స్.

=============================================================================

బ్రదర్స్

నటీనటులు : సూర్య శివకుమార్, కాజల్ అగర్వాల్

ఇతర నటీనటులు : ఇషా శర్వాణి, వివేక్, సచిన్ ఖేడ్కర్, తార

మ్యూజిక్ డైరెక్టర్ : హారిస్ జయరాజ్

డైరెక్టర్ : K.V.ఆనంద్

ప్రొడ్యూసర్ : బెల్లంకొండ సురేష్

రిలీజ్ డేట్ : 2012

సూర్య, కాజల్ అగర్వాల్ నటించిన బ్రదర్ సైన్స్ ఫిక్షన్ ఎంటర్ టైనర్. K.V. ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సూర్య కరియర్ లోనే హైలెట్ గా నిలిచింది. అతుక్కుని ఉండే కవలలుగా సూర్య నటించిన తీరు అద్భుతమనిపిస్తుంది.