ఎఫ్2 సూపర్ హిట్.. త్వరలోనే f3

Saturday,January 19,2019 - 01:46 by Z_CLU

వెంకీ-వరుణ్ హీరోలుగా నటించిన ఎఫ్2 సినిమా సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. విడుదలైన వారం రోజులకే అన్ని ఏరియాల్లో బ్రేక్-ఈవెన్ సాధించిన ఈ సినిమా.. లాంగ్ రన్ లో దాదాపు 65 కోట్ల రూపాయల షేర్ సాధించే అవకాశముందని ట్రేడ్ భావిస్తుంది. ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో ఇప్పుడు ఎఫ్3 కూడా రెడీ కానుంది.

ఈ విషయాన్ని హీరో వరుణ్ తేజ్ స్వయంగా ప్రకటించాడు. నిన్న జరిగిన సక్సెస్ మీట్ లో సీక్వెల్ ను ఎనౌన్స్ చేశాడు. ఈ విషయాన్ని దర్శకుడు అనీల్ రావిపూడి కూడా కన్ ఫర్మ్ చేశాడు. వీలైనంత త్వరగా ఎఫ్3ని తెరపైకి తీసుకొస్తామని అందులో కూడా వరుణ్, వెంకీలే హీరోలుగా ఉంటారని ప్రకటించాడు.

సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా నిన్నటితో వారం రోజుల రన్ పూర్తిచేసుకుంది. దిల్ రాజు ఈ సినిమాకు నిర్మాత.