జీ సినిమాలు : వీక్లీ రౌండప్

Sunday,January 20,2019 - 10:02 by Z_CLU

టాలీవుడ్ లో ఎప్పటికప్పుడు కొన్ని హాట్ న్యూస్ లు ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేస్తుంటాయి. మరి ఈ వారం ఆడియన్స్ ను బాగా ఆకట్టుకున్న వార్తలేంటి.. టాలీవుడ్ లో ఈ వారం సమాచారమేంటి….? ‘జీ సినిమాలు వీక్లీ రౌండప్’.

మరో అప్ కమింగ్ సెన్సేషన్ సెట్స్ పైకి వచ్చేసింది. రీసెంట్ గా 2.0 తో ఇండియన్ సినిమా మార్క్ ని వరల్డ్ వైడ్ గా ప్రెజెంట్ చేసిన దర్శకుడు శంకర్, ‘ఇండియన్ 2’ ని సెట్స్ పైకి తీసుకువచ్చేశాడు. పక్కా పకడ్బందీగా ప్రీ ప్రొడక్షన్ ని కంప్లీట్ చేసుకున్న మేకర్స్, ఈ రోజు నుండి సినిమా ఫస్ట్ షెడ్యూల్ బిగిన్ చేశారు.పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

హాస్య బ్రహ్మ, పద్మశ్రీ డాక్టర్ బ్రహ్మానందం హార్ట్ సర్జరీ నుంచి మెల్లగా కోలుకుంటున్నారు. ముంబయిలోని ఏషియన్ హార్ట్ ఇనిస్టిట్యూట్ లో బ్రహ్మానందంకు సక్సెస్ ఫుల్ గా హార్ట్ సర్జరీ ముగిసింది. ప్రస్తుతం ఆయన్ను ఐసీయూ నుంచి జనరల్ వార్డ్ కు షిఫ్ట్ చేసినట్టు బ్రహ్మానందం కొడుకు రాజా గౌతమ్ ప్రకటించాడు.పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక ఛాలెంజ్ కామనే.. ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ ’10ఇయర్స్ ఛాలెంజ్’. నెటిజన్లు తమ పదేళ్ళ క్రితం ఫోటోలను పోస్ట్ చేస్తూ తమ స్నేహితులకు ఛాలెంజ్ విసురుతున్నారు. అయితే ఈ ఛాలెంజ్ లో స్టార్స్ కూడా పాల్గొంటూ పదేళ్ళ క్రితం తమ ఫొటోలకి ఇప్పటి ఫోటోలను జతచేస్తూ అభిమానులను ఔరా అనిపిస్తున్నారు. ఈ ఛాలెంజ్ లో భాగంగా  స్టార్స్ పోస్ట్ చేసిన పదేళ్ళ క్రితం ఫోటోలు మీ కోసం.పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

‘RX 100’ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన హీరో కార్తికేయ, ఆ సినిమా తరవాత ఇమ్మీడియట్ గా ‘హిప్పీ’ సినిమా సెట్స్ పైకి వచ్చేశాడు. ఫస్ట్ సినిమా సక్సెస్ ఇంపాక్ట్ ఈ సినిమాపై కూడా పడటంతో సినిమా సెట్స్ పై ఉండగానే ఈ  సినిమాపై మంచి బజ్ క్రియేట్ అవుతుంది. ఈ సినిమా ఇంకా షూటింగ్ స్టేజ్ లో  ఉండగానే, ఇంకో సినిమాను సెట్స్ పైకి తీసుకు వచ్చేశాడు ఈ హీరో. పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

హీరో విశాల్ ఎట్టకేలకు ఓ ఇంటివాడు కాబోతున్నాడు. హైదరాబాద్ కు చెందిన అనీషా రెడ్డిని త్వరలోనే పెళ్లాడబోతున్నాడు ఈ హీరో. ఈ మేరకు రెండు కుటుంబాలు వీళ్ల పెళ్లికి అంగీకరించాయి. పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి