జీ సినిమాలు ( 1st ఏప్రిల్ )

Sunday,March 31,2019 - 10:03 by Z_CLU

ఆనందో బ్రహ్మ
నటీనటులు : తాప్సీ, శ్రీనివాస రెడ్డి, వెన్నెల కిషోర్
ఇతర నటీనటులు : షకలక శంకర్, విద్యుల్లేఖ రామన్, వెన్నెల కిషోర్
మ్యూజిక్ డైరెక్టర్ : K .
డైరెక్టర్ : మహి V . రాఘవ్
ప్రొడ్యూసర్ : విజయ్ చిల్ల, శశి దేవి రెడ్డి
రిలీజ్ డేట్ : 10 ఆగష్టు 2017
ఉద్యోగరీత్యా మలేషియాలో సెటిల్ అయిన రాము(రాజీవ్ కనకాల) ఇండియాలో ఓ వరదలో తన అమ్మనాన్నలు చనిపోయారని తెలుసుకొని ఇండియా వచ్చి తన తల్లితండ్రులు ఉండే ఇంటిని అమ్మడానికి చూస్తుంటాడు. ఇంట్లో దెయ్యాలున్నాయన్న కారణంతో ఎవరూ కొనడానికి ముందుకు రాకపోవడంతో తక్కువ డబ్బుకే ఆ ఇంటిని ఓ రౌడీకి అమ్మకానికి పెడతాడు రాము. ఈ క్రమంలో అత్యవసరంగా డబ్బు అవసరమున్న సిద్దు(శ్రీనివాస్ రెడ్డి), బాబు(షకలక శంకర్),తులసి(తాగుబోతు రమేష్), రాజు(వెన్నెల కిషోర్) ఆ ఇంట్లో ఉండి దెయ్యాలు లేవని నిరూపిస్తామని రాముతో డీల్ కుదుర్చుకుంటారు.. ఇంతకీ ఆ ఇంట్లో దెయ్యాలున్నాయా? ఉంటే వాటిని ఈ నలుగురు ఏ విధంగా భయపెట్టారు.. అసలు దెయ్యాలు మనుషులకి బయపడతాయా..? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

==============================================================================

సైజ్ జీరో
నటీనటులు : అనుష్క శెట్టి, ఆర్య
ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, ఊర్వశి, సోనాల్ చౌహాన్, అడివి శేష్, బ్రహ్మానందం, గొల్లపూడి మారుతి రావు, తనికెళ్ళ భరణి మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : M.M. కీరవాణి
డైరెక్టర్ : ప్రకాష్ కోవెలమూడి
ప్రొడ్యూసర్ : ప్రసాద్ వి. పొట్లూరి
రిలీజ్ డేట్ : 27 నవంబర్ 2015
అధిక బరువు ఉన్నప్పటికీ ఏ మాత్రం కాన్ఫిడెన్స్ తగ్గని సౌందర్య అభిషేక్ తో ప్రేమలో పడుతుంది. తన ప్రేమని పొందటం కోసం, అతి తక్కువ కాలంలో బరువు తగ్గించే క్లినిక్ లో కూడా జాయిన్ అవుతుంది. సౌందర్య అక్కడేం తెలుసుకుంటుంది..? చివరికి సౌందర్య బరువు తగ్గుతుందా..? అభిషేక్ ప్రేమను తను పొందగలుగుతుందా..? అనేదే ఈ సినిమా కథ. అనుష్క పర్ఫామెన్స్ సినిమాకి హైలెట్ గా నిలుస్తుంది.

=============================================================================

బ్రాండ్ బాబు
నటీనటులు : సుమంత్ శైలేంద్ర, ఈషా రెబ్బ
ఇతర నటీనటులు : పూజిత పున్నాడ, మురళీ శర్మ, రాజా రవీంద్ర, సత్యం రాజేష్ మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : J.B.
డైరెక్టర్ : ప్రభాకర్ P.
ప్రొడ్యూసర్ : A. శైలేంద్ర బాబు
రిలీజ్ డేట్ : ఆగష్టు 3, 2018
వ్యాపారవేత్త డైమండ్ రత్నం (మురళీ శర్మ)కు బ్రాండ్స్ అంటే పిచ్చి. డబ్బున్నవాళ్ల స్టేటస్ మొత్తం వాళ్లు వాడే బ్రాండ్స్ లోనే కనిపిస్తుందనేది అతడి ప్రగాఢ విశ్వాసం. అతడి నమ్మకాలకు తగ్గట్టే కొడుకును పెంచుతాడు రత్నం. వాడే స్పూన్ నుంచి వేసుకునే అండర్ వేర్ వరకు ఇలా ప్రతిది బ్రాండ్ వాడే హీరో (సుమంత్ శైలేంద్ర) డైమండ్.. తనకు కాబోయే భార్య కూడా ఆల్-బ్రాండ్ అమ్మాయిగా ఉండాలని భావిస్తాడు.
అయితే ఒకసారి తనకొచ్చిన ఓ మెసేజ్ చూసి హోం మినిస్టర్ కూతురు తనను ప్రేమిస్తుందని భ్రమపడతాడు. తనను ఇంప్రెస్ చేసేందుకు తన ఇంటి చుట్టూ చక్కర్లు కొడుతుంటాడు. ఈ క్రమంలో హోం మినిస్టర్ కూతురు అనుకొని, ఆ ఇంట్లో పనిచేస్తున్న రాధ (ఇషా రెబ్బా)ను ప్రేమిస్తాడు. అక్కడే అసలు కథ బిగిన్ అవుతుంది. బ్రాండ్ నే నమ్ముకున్న డిమాండ్, పని మంశితో ప్రేమలో పడితే ఏం జరుగుతుంది అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం.

==============================================================================

చిరుత
నటీనటులు : రామ్ చరణ్ తేజ, నేహా శర్మ
ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, ఆశిష్ విద్యార్థి, బ్రహ్మానందం, ఆలీ, సాయాజీ షిండే, M.S. నారాయణ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : మణిశర్మ
డైరెక్టర్ : పూరి జగన్నాథ్
ప్రొడ్యూసర్ : C. అశ్విని దత్
రిలీజ్ డేట్ : 28 సెప్టెంబర్ 2007
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ డెబ్యూ మూవీ చిరుత. పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ యాక్షన్ ఇమోషనల్ ఎంటర్ టైనర్ రామ్ చరణ్ లోని పర్ఫామెన్స్ ని స్టామినాని పర్ఫెక్ట్ గా ఎలివేట్ చేసింది. దానికి తోడు మణిశర్మ సంగీతం సినిమా సక్సెస్ లో కీ రోల్ ప్లే చేసింది.

==============================================================================


విన్నర్
నటీనటులు : సాయి ధరమ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్
ఇతర నటీనటులు : జగపతి బాబు, ఠాకూర్ అనూప్ సింగ్, ఆదర్శ్ బాలకృష్ణ, ప్రియదర్శి పుల్లికొండ, ముకేష్ రిషి, ఆలీ, వెన్నెల కిషోర్ మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : S. తమన్
డైరెక్టర్ : గోపీచంద్ మాలినేని
ప్రొడ్యూసర్ : నల్లమలుపు బుజ్జి, ఠాగూర్ మధు
రిలీజ్ డేట్ : 24 ఫిబ్రవరి 2017
సిద్దార్థ్ అనే యువకుడు (సాయి ధరమ్ తేజ్) చిన్నతనంలో కొన్ని సంఘటనల వల్ల తన తండ్రి మహేందర్ రెడ్డి(జగపతి బాబు) కి దూరంగా ఉంటూ రేసింగ్, గుర్రాలపై ద్వేషం పెంచుకుంటాడు.. అలా తండ్రికి దూరంగా ఉంటూ జీవితాన్ని కొనసాగిస్తున్న సిద్దార్థ్ ఒక సందర్భంలో సితార(రకుల్) అనే రన్నర్ ని చూసి ప్రేమలో పడతాడు. అలా తన ప్రేమలో పడిన సిద్దార్థ్ ను ఓ అనుకోని సందర్భంలో ఆది అనే రేసింగ్ జాకీ తో బెట్ కట్టిస్తుంది సితార. అలా సితార ప్రేమ కోసం తనకిష్టం లేని రేసింగ్ మొదలుపెట్టిన సిద్దార్థ్… ఆ రేసింగ్ లో ఎలా గెలిచాడు.. చివరికి తనకు 20 ఏళ్ల క్రితం దూరమైన తండ్రికి ఎలా దగ్గరయ్యాడు.. అనేది సినిమా కథాంశం.

==============================================================================

నక్షత్రం
నటీనటులు : సందీప్ కిషన్, సాయి ధరమ్ తేజ్, ప్రగ్యా జైస్వాల్, రెజినా
ఇతర నటీనటులు : తనిష్, శ్రియ శరణ్, ప్రకాష్ రాజ్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : భీమ్స్
డైరెక్టర్ : కృష్ణవంశీ
ప్రొడ్యూసర్స్ : K. శ్రీనివాసులు, S. వేణు గోపాల్
రిలీజ్ డేట్ :  4 ఆగష్టు
రామాయణంలో హనుమంతుని పాత్ర ఎంతటి ప్రాధాన్యత కలిగి ఉంటుందో.. సమాజంలో ‘పోలీస్’ పాత్ర అలాంటిది. పోలీస్ అంటే హనుమంతుడు అనే కాన్సెప్ట్ ఆధారంగా తెరకెక్కింది నక్షత్రం. పోలీస్ అవ్వాలనే ప్రయత్నంలో వున్న ఓ యువకుడి కథే ఈ ‘నక్షత్రం’. అతడ్ని పోలీస్ కాకుండా అడ్డుకున్నది ఎవరు.. చివరికి సందీప్ కిషన్ పోలీస్ అయ్యాడా లేదా అనేది స్టోరీ. ఈ బేసిక్ ప్లాట్ కు లవ్, రొమాన్స్, సెంటిమెంట్ ను యాడ్ చేశాడు దర్శకుడు కృష్ణవంశీ. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ స్పెషల్ రోల్ ప్లే చేశాడు.