ప్రభాస్ సినిమా కోసం భారీ సెట్స్

Sunday,March 31,2019 - 01:38 by Z_CLU

సాధారణంగా మేకర్స్ ఎప్పుడైనా నేచురల్ లొకేషన్స్ ఇష్టపడతారు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో సెట్స్ వేస్తారు. కానీ ఒకే సినిమా కోసం 18 సెట్స్ వేయడం మాత్రం చాలా రేర్. అలాంటి సరికొత్త రికార్డు ప్రభాస్ కొత్త సినిమాతో మొదలుకాబోతోంది.

రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమా చేస్తున్నాడు. ఇటలీ బ్యాక్ డ్రాప్ లో నడుస్తుంది ఈ పీరియాడిక్ రొమాంటిక్ లవ్ స్టోరీ. ఇప్పటికే అక్కడ ఓ షెడ్యూల్ కూడా పూర్తిచేశారు. కానీ ప్రతిసారి ఇటలీ వెళ్లడం కుదరదు. మరీ ముఖ్యంగా 1940ల నాటి ఇటలీ పరిస్థితులు ఎక్కడా కనిపించవు. అందుకే ఈ సినిమా కోసం సెట్స్ వేయాలని నిర్ణయించారు.

ప్రభాస్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా కోసం పురాతన ఇటలీ నగరాన్ని ప్రతిబింబించేలా హైదరాబాద్ లోనే ఏకంగా 18 సెట్స్ వేయబోతున్నారు. ఇకపై సినిమా మొత్తాన్ని ఈ సెట్స్ లోనే పూర్తిచేస్తారట. గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ మూవీకి జాన్ అనే టైటిల్ అనుకుంటున్నారు.