సీత టీజర్ రివ్యూ

Monday,April 01,2019 - 11:40 by Z_CLU

తేజ తీసిన ఎక్కువ సినిమాల్లో హీరో స్టార్టింగ్ లో అమయాకంగానే కనిపిస్తాడు. అలాంటి ఇన్నోసెంట్ వ్యక్తిని క్లైమాక్స్ కు వచ్చేసరికి హీరోగా చూపించడం తేజకు చాలా ఇష్టం. సీత సినిమాలో హీరో కూడా ఇలానే కనిపిస్తున్నాడు. రఘురాం అనే పాత్రలో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ మంచి లక్షణాలున్న అబ్బాయిగా కనిపిస్తున్నాడు.

సీత సినిమాకు సంబంధించి ప్రస్తుతానికి సర్ ప్రైజ్ ఎలిమెంట్ ఇదే. మొన్నటివరకు వీరోచితంగా ఫైట్స్ చేసిన బెల్లంకొండను మరీ ఇంత స్వాతిముత్యంలా చూపిస్తారని ఎవరూ కలలో కూడా ఊహించలేదు. ఈ యాంగిల్ లో సీత సినిమా ఆడియన్స్ కు చిన్నపాటి షాక్ ఇచ్చిందనే చెప్పాలి.

ఇక సీత పాత్ర పోషించిన కాజల్ ఇందులో అల్ట్రామోడ్రన్ అమ్మాయిగా, బిజినెస్ ఉమెన్ గా నటించింది. పేరుకు సీత అయినప్పటికీ ఆధునిక భావాలు కలిగిన యువతిగా కనిపించింది. ఆమెను దగ్గరుండి చూసుకునే పాత్రలో బెల్లంకొండను చూపించారు. ఇదే టీజర్ లో విలన్ గా సోనూ సూద్ ను కూడా పరిచయం చేశారు.

టీజర్ చూడ్డానికి రిచ్ గా ఉంది. అనూప్ రూబెన్స్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. ఏప్రిల్ 29న వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతోంది సీత సినిమా. నేనే రాజు నేనే మంత్రి తర్వాత తేజ తీసిన సినిమా ఇదే.