జీ సినిమాలు ( 19th నవంబర్ )

Monday,November 18,2019 - 10:03 by Z_CLU

కోకోకోకిల

నటీనటులు : నయనతార, యోగిబాబు
ఇతర నటీనటులు : శరణ్య పొన్ వన్నన్, హరీష్ పేరడి, R.S. శివాజీ, చార్లెస్ వినోత్, శరవణన్ మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : అనిరుద్
డైరెక్టర్ : నెల్సన్ దిలీప్ కుమార్
ప్రొడ్యూసర్ : అల్లిరాజా సుభాస్కరన్
రిలీజ్ డేట్ : 17 ఆగష్టు 2018
నాయుడుపేటలో ఓ పేద కుటుంబం. ఆ కుటుంబానికి కోకిలే దిక్కు. ఆమె జీతంపైనే కుటుంబం నెట్టుకొస్తున్న టైమ్ లో హఠాత్తుగా కోకిల తల్లికి ఊపిరితిత్తుల కాన్సర్ అని తెలుస్తుంది. ట్రీట్ మెంట్ కు కనీసం 15 లక్షలు ఖర్చు అవుతుంది. డబ్బు కోసం ప్రయత్నిస్తున్న టైమ్ లో అనుకోకుండా ఓ మాదక ద్రవ్యాల ముఠా, కోకిలకు పరిచయమౌతుంది. అలా డ్రగ్స్ సరఫరా చేసే అమ్మాయిగా మారుతుంది.

కానీ పోలీసులకు విషయం తెలిసిపోతుంది. మాఫియాలోనే ఓ వ్యక్తి పోలీసులకు లీక్ చేస్తాడు. మరోవైపు అనుకోని పరిస్థితుల మధ్య డ్రగ్స్ మాఫియా నాయకుల్లో ఒకడ్ని కోకిల చంపేస్తుంది. ఓవైపు పోలీసులు, మరోవైపు మాఫియా.. వీళ్ల నుంచి కోకిల ఎలా తప్పించుకుంది. తన కుటుంబాన్ని ఎలా కాపాడుకుంది అనేది కథ.

==============================================================================

దేవత

హీరోహీరోయిన్లు – శోభన్ బాబు, శ్రీదేవి
ఇతర 
నటీనటులు – జయప్రద, మోహన్ బాబు, రావుగోపాల్రావు
సంగీతం – చక్రవర్తి
దర్శకత్వం – కె.రాఘవేంద్రరావు
విడుదల తేదీ – 1982, సెప్టెంబర్ 4

దేవత పేరుచెప్పగానే బిందెలు గుర్తొస్తాయిచీరలతో చేసిన డెకరేషన్ గుర్తొస్తుంది వెంటనే  సూపర్ హిట్ సాంగ్ గుర్తొస్తుందిఅదే వెల్లువొచ్చి గోదారమ్మ పాట. దర్శకుడు కె.రాఘవేంద్రరావు, సంగీత దర్శకుడు చక్రవర్తి కాంబినేషన్ లో చాలా సినిమాలొచ్చాయివాటిలో ఎన్నో పాటలు హిట్ అయ్యాయికానీ దేవతలోని  పాట మాత్రం చిరస్థాయిగా నిలిచిపోతుందిసురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిన  సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది.

==============================================================================

వసంతం 

నటీనటులు : వెంకటేష్, ఆర్తి అగర్వాల్, కళ్యాణి

ఇతర నటీనటులు : V.V.S. లక్ష్మణ్, ఆకాష్, సునీల్, చంద్ర మోహన్, తనికెళ్ళ భరణి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : S.A. రాజ్ కుమార్

డైరెక్టర్ : విక్రమన్

ప్రొడ్యూసర్ : N.V. ప్రసాద్

రిలీజ్ డేట్ : 11 జూలై 2003

స్నేహానికి, ప్రేమకు మధ్య డిఫెరెన్స్ ని అద్భుతంగా ఎలివేట్ చేసిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ వసంతం. ఎంత పెద్ద త్యాగానికైనా వెనకాడని ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కథే ఈ సినిమా. ఇమోషనల్ సీన్స్ సినిమాకి హైలెట్ గా నిలుస్తాయి.

=============================================================================

అందాల రాముడు
నటీనటులు సునీల్ఆర్తి అగర్వాల్
ఇతర నటీనటులు ఆకాశ్వడివుక్కరసికోట శ్రీనివాస రావుబ్రహ్మానందంధర్మవరపువేణు మాధవ్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : S.A. రాజ్ కుమార్
డైరెక్టర్ : P. లక్ష్మి కుమార్
ప్రొడ్యూసర్ : N.V. ప్రసాద్పరాస్ జైన్
రిలీజ్ డేట్ : ఆగష్టు 11, 2006
సునీల్ తన కరియర్ లో ఫస్ట్ టైం ఫుల్ ఫ్లెజ్డ్ హీరోగా నటించిన చిత్రం అందాల రాముడు. ఈ సినిమా సునీల్ కరియర్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్ళింది. ఆర్తి అగర్వాల్ నటన సినిమాకే హైలెట్.

=============================================================================

బలాదూర్

నటీనటులు : రవితేజఅనుష్క శెట్టి

ఇతర నటీనటులు : కృష్ణచంద్ర మోహన్ప్రదీప్ రావత్సునీల్బ్రహ్మానందంసుమన్ శెట్టి తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : K.M. రాధాకృష్ణన్

డైరెక్టర్ : K.R. ఉదయ శంకర్

ప్రొడ్యూసర్ : D. రామానాయుడు

రిలీజ్ డేట్ : 15 ఆగష్టు 2008

బాధ్యత లేకుండా తిరుగుతుంటాడు చంటి. అందుకే అస్తమానం తండ్రితో మాటలు పడుతుంటాడు. అలాంటప్పుడు కూడా చంటి పెదనాన్న రామకృష్ణ చంటికి సపోర్టివ్ గా ఉంటాడు. అందుకే చంటికి పెదనాన్న అంటే చాలా ఇష్టం. ఇదిలా ఉంటే ఉమాపతి రామకృష్ణని ఎలాగైనా ఇబ్బందుల పాలు చేయలని ప్రయత్నం చేస్తుంటాడు. అప్పుడు చంటి ఏం చేస్తాడు..ఎలా తన కుటుంబాన్ని… రామక్రిష్ణని కాపాడుకుంటాడు..అనేదే సినిమా ప్రధాన కథాంశం.

==============================================================================

లై

నటీనటులు నితిన్, మేఘా ఆకాష్

ఇతర నటీనటులు : అర్జున్ సర్జ, శ్రీకాంత్, అజయ్, రవి కిషన్, నాజర్, ధృతిమాన్ ఛటర్జీ, బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ

డైరెక్టర్ హను రాఘవపూడి

ప్రొడ్యూసర్ : రామ్ ఆచంట, గోపీ ఆచంట, అనిల్ సుంకర

రిలీజ్ డేట్ : 11 ఆగష్టు 2017  

లై’ స్టోరీలైన్ చెప్పాలంటే సినిమా మొత్తం టైటిల్ కు తగ్గట్టు అబద్ధాలు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మీదే నడుస్తుంది. ఓ సూటు చుట్టూ అల్లుకున్న ఇంటలిజెంట్ స్టోరీలైన్ ఇది. ఒక రకంగా చెప్పాలంటే ఒక సూట్ చుట్టూ కథ మొత్తం తిరుగుతూ ఉంటుంది. ఈ ప్రాసెస్ లో పాతబస్తీ కుర్రాడికి, లాస్ వెగాస్ లో ఉన్న విలన్ కనెక్ట్ అవ్వడం, ఇలా చెప్పుకుంటూ పోతే ‘లై’ కంప్లీట్ గా ఒక ఇంటెలిజెంట్ థ్రిల్లింగ్ ఎంటర్ టైనర్. నితిన్, మేఘా ఆకాష్ కెమిస్ట్రీ సినిమాకి మరో ఎట్రాక్షన్.