జీ సినిమాలు ( 16th సెప్టెంబర్ )

Sunday,September 15,2019 - 09:47 by Z_CLU

మాతంగి

నటీనటులు : రమ్య కృష్ణన్, జయరామ్

ఇతర నటీనటులు : ఓం పురి, శీలు అబ్రహాం, రమేష్ పిషరోది, సాజు నవోదయ, అక్షర కిషోర్, ఏంజిలిన అబ్రహాం తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : రతీష్ వేఘ

డైరెక్టర్ : కన్నన్ తామరక్కులం

ప్రొడ్యూసర్ : హసీబ్ హనీఫ్, నౌషాద్ అలాతుర్

రిలీజ్ డేట్ : 20 మే 2016

సత్యజిత్(జయరాం) ఓ ప్రముఖ వ్యాపార వేత్త.. ఉన్నట్టుండి రాత్రి వేళలో సత్యజిత్ కి కొన్ని పీడ కలలు వస్తుంటాయి. ఈ క్రమంలో ఓ రోజు తన కుటుంబమంతా నాశనం అవ్వబోతుందనే కల కంటాడు… తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం, సమస్య కి పరిష్కారం వెతుక్కుంటూ మహేశ్వర బాబా(ఓం పూరి) ని కలుస్తాడు. అయితే సత్యజిత్ గతంలో కొన్న ఓ పాత భవనం వల్లే ఈ సమస్య వచ్చిందని…అందులో ఉన్న మాతంగి అనే ఓ ఆత్మ వల్లే ఇదంతా జరుగుతుందని తెలుసుకుంటాడు. ఇంతకీ ఆ పాత భవనంలో  ఆత్మగా మారిన మాతంగి ఎవరు…?  మాతంగి కి సత్యజిత్ కి సంబంధం ఏమిటి..? చివరికి ఆ ఆత్మ నుంచి సత్యజిత్ తన కుటుంబాన్ని కాపాడుకోగలిగాడా…? అనేది సినిమా కథాంశం.

==============================================================================

నవ వసంతం

నటీనటులు : తరుణ్, ప్రియమణి

ఇతర నటీనటులు : ఆకాష్,అంకిత, సునీల్, రోహిత్, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు ,ఆహుతి ప్రసాద్, తెలంగాణ శకుంతల తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : ఎస్.ఏ.రాజ్ కుమార్

డైరెక్టర్ : కె.షాజహాన్

ప్రొడ్యూసర్ : ఆర్.బి.చౌదరి

రిలీజ్ డేట్ : 9 నవంబర్ 2007

తరుణ్, ప్రియమణి హీరో హీరోయిన్స్ గా దర్శకుడు షహజాహాన్ తెరకెక్కించిన ఫామిలీ ఎంటర్టైనర్ సినిమా ‘నవ వసంతం’. అందమైన లవ్ స్టోరీ తో పాటు స్నేహితుల మధ్య అనుబంధాన్ని చాటి చెప్పే కథ తో  సూపర్ గుడ్ ఫిలిమ్స్ నిర్మించిన ఈ సినిమా సూపర్ గుడ్ ఫిలిం గా అందరినీ ఆకట్టుకొని అలరిస్తుంది. తరుణ్ ప్రియమణి మధ్య వచ్చే లవ్ సీన్స్,  తరుణ్, ఆకాష్, రోహిత్, సునీల్ మధ్య వచ్చే సెంటిమెంట్ సీన్స్ తో పాటు ఎస్.ఏ. రాజ్ కుమార్ మ్యూజిక్ ఈ సినిమాకు హైలైట్స్…

==============================================================================

ఆచారి అమెరికా యాత్ర

నటీనటులు : మంచు విష్ణు, ప్రగ్యా జైస్వాల్
ఇతర నటీనటులు : కోట శ్రీనివాస రావు, బ్రహ్మానందం, ప్రదీప్ రావత్, రాజా రవీంద్ర, ఠాకూర్ అనూప్ సింగ్ మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : S.S. థమన్
డైరెక్టర్ : G. నాగేశ్వర రెడ్డి
ప్రొడ్యూసర్స్ : కీర్తి చౌదరి, కిట్టు
రిలీజ్ డేట్ : 27 ఏప్రిల్ 2018
కృష్ణమా చారి( విష్ణు), అప్పలా చారి (బ్రహ్మానందం) గురు శిష్యులు… తమ టీంతో కలిసి పూజలు చేస్తుంటారు.అయితే ఓసారి చక్రపాణి(కోట శ్రీనివాసరావు)అనే పెద్ద మనిషి ఇంట్లో హోమం చేయించడానికి వెళ్ళినప్పుడు అమెరికా నుంచి వచ్చిన ఆయన మనవరాలు రేణుక(ప్రగ్యా జైస్వాల్)తో ప్రేమలో పడతాడు కృష్ణమాచార్య. అదే సమయంలో రేణుక మీద హత్య ప్రయత్నం జరుగుతుంది. హోమం చివరి రోజు అనుకోకుండా చక్రపాణి చనిపోతాడు. రేణుక కూడా కనుమరుగై పోతుంది. అయితే రేణుక అమెరికా వెళ్లిందని తెలుసుకుని అప్పలాచారికి ఉద్యోగ ఆశ చూపించి ఎట్టకేలకు తన టీంతో కలిసి అమెరికా వెళతాడు కృష్ణమాచార్య. అలా రేణుక ను కలుసుకోవడానికి అమెరికాకు వెళ్ళిన కృష్ణమాచారి రేణుకకు విక్కీతో పెళ్లి జరగబోతుందని తెలుసుకుంటాడు. ఇక విక్కీ నుండి రేణుకను ఎలా కాపాడాడు చివరికి కృష్ణమాచార్య తన ప్రేమను ఎలా గెలిపించుకున్నాడు అనేదే బాలన్స్ కథ.

=============================================================================

సైనికుడు
నటీనటులు మహేష్ బాబు, త్రిష కృష్ణన్
ఇతర నటీనటులు ప్రకాష్ రాజ్, ఇర్ఫాన్ ఖాన్, కామ్న జెఠ్మలాని, కోట శ్రీనివాస రావు, రవి వర్మ అజయ్
మ్యూజిక్ డైరెక్టర్ హారిస్ జయరాజ్
డైరెక్టర్ గుణశేఖర్
ప్రొడ్యూసర్ :  అశ్విని దత్
రిలీజ్ డేట్ :  1 డిసెంబర్ 2006
మహేష్ బాబు కరియర్ లో సైనికుడు సినిమా ప్రత్యేకమైనది. రాజకీయ అవినీతి పరులపై ఒక యువకుడు చేసిన పోరాటమే సైనికుడు. క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కోసం సరికొత్త టెక్నాలజీని వాడారు. త్రిష అమాయకత్వపు నటన సినిమాకే హైలెట్. హారిస్ జయరాజ్ ప్రతి పాట బావుంటుంది.

============================================================================

రారండోయ్ వేడుక చూద్దాం
నటీనటులు : అక్కినేని నాగచైతన్య, రకుల్ ప్రీత్ సింగ్
ఇతర నటీనటులు : జగపతి బాబు, సంపత్ రాజ్, వెన్నెల కిషోర్, పోసాని కృష్ణ మురళి, పృథ్విరాజ్, చలపతి రావు మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్
డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ కురసాల
ప్రొడ్యూసర్ : నాగార్జున అక్కినేని
రిలీజ్ డేట్ : 26 మే 2017
పల్లెటూరిలో ఓ పెద్దమనిషిగా కొనసాగే ఆది(సంపత్) ఏకైక కూతురు భ్రమరాంబ(రకుల్ ప్రీత్) చిన్నతనం నుంచి నాన్న గారాల పట్టిగా పెరిగి పెద్దవుతుంది. అలా నాన్నని కుటుంబాన్ని అమితంగా ప్రేమించే భ్రమరాంబను కజిన్ బ్రదర్ పెళ్లిలో చూసి మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు శివ(నాగ చైతన్య). అలా భ్రమరాంబతో ప్రేమలో పడిన శివ.. ఆదికి తన తండ్రి కృష్ణ(జగపతి బాబు) కి గొడవ ఉందని ఆ గొడవే తన ప్రేమకు అడ్డుగా మారిందని తెలుసుకుంటాడు.ఇంతకీ ఆది-కృష్ణ కి ఏమవుతాడు..? వారిద్దరి మధ్య గొడవేంటి.. చివరికి శివ-భ్రమరాంబ కలిశారా లేదా అనేది స్టోరి.

==============================================================================

శివలింగ

నటీనటులు : రాఘవ లారెన్స్, రితిక సింగ్

ఇతర నటీనటులు : శక్తి వాసుదేవన్, రాధా రవి, వడివేలు, సంతాన భారతి మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : S.S. తమన్

డైరెక్టర్ : P. వాసు

ప్రొడ్యూసర్ : R. రవీంద్రన్

రిలీజ్ డేట్ : 14 ఏప్రియల్ 2017

ట్రైన్ లో ప్రయాణిస్తూ హఠాత్తుగా చనిపోయిన రహీం(శక్తి) కేస్ ను ఇంటరాగేషన్ చేయమని పవర్ ఫుల్ సీబీ-సీఐడీ ఆఫీసర్ శివలింగేశ్వర్(లారెన్స్) కు అప్పజెప్తారు కమిషనర్.. అలా కమిషనర్ ఆర్డర్ తో రహీం కేసును టేకప్ చేసిన శివలింగేశ్వర్ తన భార్య సత్యభామ(రితిక సింగ్)తో కలిసి వరంగల్ కి షిఫ్ట్ అవుతాడు. అలా రహీం కేసు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించిన లింగేశ్వర్ ఆ కేసులో ఎలాంటి నిజాలు తెలుసుకున్నాడు..? చనిపోయిన రహీం బ్యాక్ గ్రౌండ్ ఏంటి.. ఫైనల్ గా శివలింగేశ్వర్ ఏం చేశాడు.. అనేది సినిమా కథాంశం.