మొన్న హారర్.. ఈసారి కామెడీ

Monday,September 16,2019 - 10:34 by Z_CLU

నిను వీడని నీడను నేనే సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి వచ్చాడు సందీప్ కిషన్. ఈ సినిమాతో నిర్మాతగా కూడా క్లిక్ అయ్యాడు. అలా కంప్లీట్ హారర్ ఎలిమెంట్స్ తో సక్సెస్ అందుకున్న ఈ హీరో, ఇప్పుడు దానికి పూర్తి రివర్స్ లో కంప్లీట్ కామెడీ ఎలిమెంట్స్ తో సినిమా చేశాడు. అదే తెనాలి రామకృష్ణ బీఏ.బీఎల్. హన్సిక హీరోయిన్ గా నటించిన ఈ సినిమా టీజర్ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు.

హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ.. “చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఈ సినిమా చేశాను. ఫస్ట్ టైం సిన్సియర్ గా నా పనిని హండ్రెడ్ పర్సెంట్ ఎంజాయ్ చేస్తూ వర్క్ చేశాను. ఈ క్రెడిట్ అంతా దర్శకుడు నాగేశ్వర్ రెడ్డిదే.. ఈ సినిమాకి ఆయన దొరకడం నా అదృష్టం. ఎమోషన్స్ తో పాటు పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సినిమా బిగినింగ్ నుండి ఎండింగ్ వరకు నవ్వుతూనే వుంటారు.”

నటీనటులు
సందీప్ కిషన్, హన్సిక, వరలక్ష్మి శరత్ కుమార్, మురళీశర్మ, అయ్యప్పశర్మ, రఘుబాబు, పోసాని, సప్తగిరి, వెన్నెల కిషోర్, ప్రభాస్ శ్రీను, చమ్మక్ చంద్ర, బెనర్జీ, అనంత్, కాదంబరి కిరణ్, ప్రదీప్, అన్నపూర్ణ, వై.విజయ
టెక్నీషియన్స్
కథ: టి.రాజసింహ
మాటలు: భవాని ప్రసాద్, నివాస్
సంగీతం: సాయి కార్తీక
డీఓపీ: సాయి శ్రీరామ్
ఆర్ట్స్: కిరణ్
ఎడిటింగ్: చోట కె.ప్రసాద్
యాక్షన్: వెంకట్
నిర్మాతలు: అగ్రహారం నాగిరెడ్డి, సంజీవరెడ్డి
స్క్రీన్ ప్లే-దర్శకత్వం: జి.నాగేశ్వరరెడ్డి