ఆ దర్శకుడితో కాజల్ మరో సారి !

Sunday,September 15,2019 - 04:02 by Z_CLU

లేటెస్ట్ గా ‘కల్కి’ సినిమాను డైరెక్ట్ చేసిన ప్రశాంత్ వర్మ నెక్స్ట్ కాజల్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. మొదటి సినిమాను కాజల్ తో చేసి ప్రశంసలు అందుకున్న ఈ యంగ్ డైరెక్టర్ ఇప్పుడు మళ్ళీ ఆమెతోనే సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ ఫినిష్ చేసిన ప్రశాంత్ వర్మ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా మొదలెట్టేసాడని తెలుస్తుంది.

ప్రస్తుతం కమల్ హాసన్ -శంకర్ కాంబినేషన్ లో రూపొందనున్న ‘ఇండియన్ 2’ చేస్తుంది కాజల్. ఈ సినిమా షూటింగ్ నవంబర్ నుండి మొదలు కానుంది. ఈ సినిమా గ్యాప్ లోనే ప్రశాంత్ వర్మ సినిమాను కంప్లీట్ చేయాలని చూస్తుంది. ఫీమేల్ సెంట్రిక్ జోనర్ లో తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించి త్వరలోనే డీటెయిల్స్ తో అనౌనన్స్ మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది.