జీ సినిమాలు ( 19th జనవరి )

Saturday,January 18,2020 - 10:01 by Z_CLU

ఆ ఇంట్లో

నటీ నటులు : చిన్నామయూరి,
ఇతర నటీనటులు : వినోద్ కుమార్దేవనకోట శ్రీనివాస రావు
మ్యూజిక్ డైరెక్టర్ : కోటి
డైరెక్టర్ : చిన్న
ప్రొడ్యూసర్ : S. శ్రీనివాస రెడ్డి రాజు చౌదరి
రిలీజ్ డేట్ : 2009

చిన్నా ప్రధాన పాత్రలో నటించిన ఆ ఇంట్లో హారర్ ఎంటర్ టైనర్. తన ఇద్దరు పిల్లలతో కొత్త ఇంట్లోకి అడుగు పెట్టిన హీరో అక్కడ ఏం చూశాడు..అక్కడి పరిస్థితులను ఎదుర్కోవడానికి తాంత్రికుడిని కలుసుకున్న హీరో ఏం తెలుసుకున్నాడు అనేదే ప్రధాన కథాంశం.

=============================================================================

శివ

నటీనటులు : నాగార్జునఅమల

ఇతర నటీనటులు : రఘువరన్, J.D.చక్రవర్తితనికెళ్ళ భరణిశుభలేఖ సుధాకర్పరేష్ రావల్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : ఇళయ రాజా

డైరెక్టర్ : రామ్ గోపాల్ వర్మ

ప్రొడ్యూసర్ అక్కినేని వెంకట్

రిలీజ్ డేట్ : 7 డిసెంబర్ 1990

రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన శివ’ దాదాపు అప్పటి వరకు ఉన్న టాలీవుడ్ రూపు రేఖల్ని మార్చేసింది. సినిమా అంటే ఇలాగే ఉండాలి అని ఒక రోటీన్ ఫార్మూలాలో వెళుతున్న ట్రెండ్ ఒక పెద్ద కుదుపు లాంటిదీ సినిమా. ఈ సినిమా రిలీజ్ అయి 26 ఏళ్ళు గడిచినా ఆ సినిమా పట్ల ఉన్న క్రేజ్ ఇప్పటికీ అలాగే ఉంది. ఈ సినిమాకి ఇళయ రాజా ఇచ్చిన సంగీతం ఇప్పటికీ ఫ్రెష్ గానే అనిపిస్తుంది.

==============================================================================

బెండు అప్పారావు R.M.P.

నటీనటులు : అల్లరి నరేష్కామ్న జెఠ్మలానీ

ఇతర నటీనటులు : కృష్ణ భగవాన్మేఘన రాజ్ఆహుతి ప్రసాద్రఘుబాబు, L.B. శ్రీరామ్ధర్మవరపు సుబ్రహ్మణ్యం తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : కోటి

డైరెక్టర్ : E.V.V. సత్యనారాయణ

ప్రొడ్యూసర్ : D. రామానాయుడు

రిలీజ్ డేట్ : 16 అక్టోబర్ 2009

R.M.P. గా పని చేస్తుంటాడు బెండు అప్పారావు. నిజానికి తనకు వైద్యం చేసే పద్ధతి తెలీకపోయినాచిన్నా చితకా ట్రిక్స్ వాడి ఊరి జనానికి వైద్యం చేస్తుంటాడు. దానికి తోడు తన అక్క కాపురాన్ని ఎలాగైనా నిలబెట్టాలని తాపత్రయపడుతుంటాడు. బెండు అప్పారావు బావఎప్పుడు చూసినా తన అక్కని కట్నం కోసం వేదిస్తూనే ఉంటాడు. అంతలో ఊరిలో జరిగిన ఒక సంఘటన అప్పారావు జీవితాన్ని ఇంకో మలుపు తిప్పుతుంది. ఏంటది..అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం.

==============================================================================

కందిరీగ
నటీనటులు : రామ్హన్సిక  మోత్వాని
ఇతర నటీనటులు : అక్ష పార్ధసానిజయ ప్రకాష్ రెడ్డిసోను సూద్జయ ప్రకాష్ రెడ్డిచంద్ర మోహన్శ్రీనివాస రెడ్డి తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : S. తమన్
డైరెక్టర్ : సంతోష్ శ్రీనివాస్
ప్రొడ్యూసర్ : బెల్లంకొండ సురేష్
రిలీజ్ డేట్ : 12 ఆగష్టు 2011
ఎనర్జిటిక్ స్టార్ రామ్హన్సిక మోత్వాని జంటగా నటించిన హిలేరియస్ యాక్షన్ ఎంటర్ టైనర్ కందిరీగ. కామెడీ ఈ సినిమాకి పెద్ద ఎసెట్ గా నిలిచింది.

==============================================================================

శివలింగ

నటీనటులు రాఘవ లారెన్స్రితిక సింగ్

ఇతర నటీనటులు : శక్తి వాసుదేవన్రాధా రవివడివేలుసంతాన భారతి మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : S.S. తమన్

డైరెక్టర్ : P. వాసు

ప్రొడ్యూసర్ : R. రవీంద్రన్

రిలీజ్ డేట్ : 14 ఏప్రియల్ 2017

ట్రైన్ లో ప్రయాణిస్తూ హఠాత్తుగా చనిపోయిన రహీం(శక్తి) కేస్ ను ఇంటరాగేషన్ చేయమని పవర్ ఫుల్ సీబీ-సీఐడీ ఆఫీసర్ శివలింగేశ్వర్(లారెన్స్) కు అప్పజెప్తారు కమిషనర్.. అలా కమిషనర్ ఆర్డర్ తో రహీం కేసును టేకప్ చేసిన శివలింగేశ్వర్ తన భార్య సత్యభామ(రితిక సింగ్)తో కలిసి వరంగల్ కి షిఫ్ట్ అవుతాడు. అలా రహీం కేసు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించిన లింగేశ్వర్ ఆ కేసులో ఎలాంటి నిజాలు తెలుసుకున్నాడు..చనిపోయిన రహీం బ్యాక్ గ్రౌండ్ ఏంటి.. ఫైనల్ గా శివలింగేశ్వర్ ఏం చేశాడు.. అనేది సినిమా కథాంశం.

==============================================================================

ఎక్కడికి పోతావు చిన్నవాడా

నటీనటులు : నిఖిల్ సిద్ధార్థ, హేబా పటేల్, అవిక గోర్

ఇతర నటీనటులు : నందితా శ్వేత, వెన్నెల కిషోర్, అన్నపూర్ణ, సత్య, సుదర్శన్ మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : శేఖర్ చంద్ర

డైరెక్టర్ : వి. ఐ. ఆనంద్

ప్రొడ్యూసర్ : P.V. రావు

రిలీజ్ డేట్ : 18 నవంబర్ 2016

ఒక అమ్మాయిని ప్రేమించి మోసపోయిన అర్జున్(నిఖిల్) తన స్నేహితుడి అన్నయ్య కు దెయ్యం వదిలించడానికి అనుకోకుండా ఆత్మలను వదిలించే కేరళ లోని మహిశాసుర మర్దిని గుడికి వెళ్లాల్సి వస్తుంది. అలా కిషోర్(వెన్నెల కిషోర్) తో కేరళ వెళ్లిన అర్జున్ కి అమల(హెబ్బా పటేల్) అనే అమ్మాయి పరిచయం అవుతుంది. అలా పరిచయమైన అమల తన యాటిట్యూడ్ తో అర్జున్ కు దగ్గరవుతుంది. ఇంతకీ అమల అక్కడికి ఎందుకొచ్చింది? అర్జున్ కి కావాలనే ఎందుకు దగ్గరైంది? అసలు అమల ఎవరు? కేరళ వెళ్లిన అర్జున్ హైదరాబాద్ తిరిగొచ్చాక అమల గురించి ఏం తెలుసుకున్నాడు? అనేది చిత్ర కధాంశం.