జీ సినిమాలు ( 16th ఆగష్టు )

Thursday,August 15,2019 - 10:08 by Z_CLU

సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం

నటీనటులు : అల్లరి నరేష్, మంజరి
ఇతర నటీనటులు : శ్రద్ధా దాస్, జయ ప్రకాష్ రెడ్డి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, కొండవలస లక్ష్మణ రావు, M.S. నారాయణ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : K.M. రాధా కృష్ణన్
డైరెక్టర్ : ఈశ్వర్
ప్రొడ్యూసర్ : మల్లా విజయ ప్రసాద్
రిలీజ్ డేట్ : 14 ఆగష్టు 2008
అల్లరి నరేష్, మంజరి హీరో హీరోయిన్లుగా నటించిన సిద్ధూ ఫ్రం శ్రీకాకుళం సినిమా పర్ఫెక్ట్ ఫ్యామిలీ కామెడీ ఎంటర్ టైనర్. ప్రాణం కన్నా ప్రేమే గొప్పది అన్నదే ఈ సినిమా ప్రధాన కథాంశం. కామెడీ ఈ సినిమాలో హైలెట్ గా నిలిచింది.

==============================================================================

ఒంగోలు గిత్త

నటీనటులు : రామ్ పోతినేని, కృతి కర్బందా

ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, కిషోర్ దాస్, ప్రభు, అజయ్, అభిమన్యు సింగ్, ఆహుతి ప్రసాద్, రమాప్రభ, రఘుబాబు, సంజయ్ రెడ్డి తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : G.V. ప్రకాష్ కుమార్

డైరెక్టర్ భాస్కర్

ప్రొడ్యూసర్ : B.V.S.N. ప్రసాద్

రిలీజ్ డేట్ : 1 ఫిబ్రవరి 2013

రామ్ కరియర్ లోనే అల్టిమేట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఒంగోలుగిత్త. పసితనంలో తన తండ్రికి జరిగిన అన్యాయానికి, ఆ కుట్ర వెనక దాగిన పెద్ద మనిషి అసలు రంగును బయటపెట్టడానికి వచ్చిన యువకుడిలా రామ్ అద్భుతంగా నటించాడు. ఈ సినిమాలో కృతి కర్బందా హీరోయిన్ గా నటించింది.

============================================================================

 

 

ఇద్దరమ్మాయిలతో

నటీనటులు : అల్లు అర్జున్, అమలా పాల్, కేథరిన్
ఇతర నటీనటులుబ్రహ్మానందం, తనికెళ్ళ భరణి, తులసి, నాజర్, ప్రగతి, ఆలీ, షవార్ ఆలీతదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్
డైరెక్టర్ : పూరి జగన్నాథ్
ప్రొడ్యూసర్ బండ్ల గణేష్
రిలీజ్ డేట్ : 31 మే, 2013
అల్లు అర్జున్ హీరోగా పూరి జగన్నాథ్ హీరోగా తెరకెక్కిన అల్టిమేట్ యాక్షన్ ఎంటర్ టైనర్ఇద్దరమ్మాయిలతో. బండ్ల గణేష్ నిర్మించిన ఈ సినిమా బన్ని కరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిర్మించింది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ సినిమాకి పెద్ద ఎసెట్.

=============================================================================

చిరుత

నటీనటులు : రామ్ చరణ్ తేజ, నేహా శర్మ

ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, ఆశిష్ విద్యార్థి, బ్రహ్మానందం, ఆలీ, సాయాజీ షిండే, M.S. నారాయణ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : మణిశర్మ

డైరెక్టర్ : పూరి జగన్నాథ్

ప్రొడ్యూసర్ : C. అశ్విని దత్

రిలీజ్ డేట్ : 28 సెప్టెంబర్ 2007

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ డెబ్యూ మూవీ చిరుత. పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ యాక్షన్ ఇమోషనల్ ఎంటర్ టైనర్ రామ్ చరణ్ లోని పర్ఫామెన్స్ ని స్టామినాని పర్ఫెక్ట్ గా ఎలివేట్ చేసింది. దానికి తోడు మణిశర్మ సంగీతం సినిమా సక్సెస్ లో కీ రోల్ ప్లే చేసింది.

=============================================================================

శివలింగ

నటీనటులు : రాఘవ లారెన్స్, రితిక సింగ్

ఇతర నటీనటులు : శక్తి వాసుదేవన్, రాధా రవి, వడివేలు, సంతాన భారతి మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : S.S. తమన్

డైరెక్టర్ : P. వాసు

ప్రొడ్యూసర్ : R. రవీంద్రన్

రిలీజ్ డేట్ : 14 ఏప్రియల్ 2017

ట్రైన్ లో ప్రయాణిస్తూ హఠాత్తుగా చనిపోయిన రహీం(శక్తి) కేస్ ను ఇంటరాగేషన్ చేయమని పవర్ ఫుల్ సీబీ-సీఐడీ ఆఫీసర్ శివలింగేశ్వర్(లారెన్స్) కు అప్పజెప్తారు కమిషనర్.. అలా కమిషనర్ ఆర్డర్ తో రహీం కేసును టేకప్ చేసిన శివలింగేశ్వర్ తన భార్య సత్యభామ(రితిక సింగ్)తో కలిసి వరంగల్ కి షిఫ్ట్ అవుతాడు. అలా రహీం కేసు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించిన లింగేశ్వర్ ఆ కేసులో ఎలాంటి నిజాలు తెలుసుకున్నాడు..? చనిపోయిన రహీం బ్యాక్ గ్రౌండ్ ఏంటి.. ఫైనల్ గా శివలింగేశ్వర్ ఏం చేశాడు.. అనేది సినిమా కథాంశం.

==============================================================================

రామయ్యా వస్తావయ్యా
నటీనటులు : NTR, శృతి హాసన్, సమంత రుత్ ప్రభు
ఇతర నటీనటులు : విద్యుల్లేఖ రమణ్, P.రవి శంకర్, ముకేష్ రిషి, కోట శ్రీనివాస్ రావు, రావు రమేష్, తనికెళ్ళ భరణి
సంగీతం : S.S. తమన్
డైరెక్టర్ : హరీష్ శంకర్
నిర్మాత దిల్ రాజు
జూనియర్ ఎన్టీఆర్ కరియర్ లోనే కలర్ ఫుల్ గా ఎంటర్ టైనర్ గా నిలిచింది రామయ్యా వస్తావయ్య. శృతి హాసన్, సమంతా లు హీరోయిన్లు గా నటించిన ఈ సినిమాని దిల్ రాజు నిర్మించాడు. సినిమా ఫస్ట్ హాఫ్ లో లవర్ బాయ్ లా, జాలీగా ఉండే కుర్రాడిలా ఉండే NTR, ఇంటర్వెల్ బ్యాంగ్ తరవాత తన విశ్వరూపం చూపిస్తాడు. ఎక్స్ పెక్ట్ చేయని ట్విస్టు లతో సినిమాని చాలా ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కించాడు హరీష్ శంకర్. S.S. తమన్ మ్యూజిక్ సినిమాకే హైలెట్.