రణరంగం ఫస్ట్ డే కలెక్షన్

Friday,August 16,2019 - 11:57 by Z_CLU

శర్వానంద్ హీరోగా నటించిన రణరంగం సినిమా మొదటి రోజు భారీ వసూళ్లు రాబట్టింది. ఇంకా చెప్పాలంటే శర్వా కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచింది ఈ సినిమా. సుధీర్ వర్మ దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాకు వరల్డ్ వైడ్ 4 కోట్ల 25 లక్షల రూపాయల షేర్ వచ్చింది. ఇక ఏపీ,నైజాంలో చూసుకుంటే.. ఈ సినిమాకు 3 కోట్ల 83 లక్షల రూపాయల షేర్ వచ్చింది. రిలీజ్ కు ముందు శర్వానంద్ మాఫియా డాన్ గెటప్ కు మంచి హైప్ రావడంతో పాటు.. రామ్ చరణ్ తో ఓ చిన్న యాక్షన్ కట్ ట్రయిలర్ ను విడుదల చేయడం సినిమాకు ప్లస్ అయింది.

ఏపీ, నైజాం ఫస్ట్ డే షేర్
నైజాం – రూ. 1.41 కోట్లు
సీడెడ్ – రూ. 0.48 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 0.51 కోట్లు
ఈస్ట్ – రూ. 0.36 కోట్లు
వెస్ట్ – రూ. 0.28 కోట్లు
గుంటూరు – రూ. 0.36 కోట్లు
నెల్లూరు – రూ. 0.20 కోట్లు
కృష్ణా – రూ. 0.23 కోట్లు