ఇద్దరమ్మాయిలతో ఏడేళ్లు

Sunday,May 31,2020 - 01:12 by Z_CLU

అప్పటికే స్టయిలిష్ స్టార్. అతడ్ని మరింత స్టయిలిష్ గా చూపించడమంటే అంతకంటే టఫ్ జాబ్ ఇంకొకటి ఉండదు. అలాంటి కష్టమైన జాబ్ ను ఎంతో ఇష్టంగా పూర్తిచేసి, అందరికీ నచ్చేలా బన్నీని ప్రజెంట్ చేశాడు డైనమిక్ డైరక్టర్ పూరి జగన్నాధ్. అదే ఇద్దరమ్మాయిలతో సినిమా. ఈ సినిమా విడుదలై ఈరోజుకి (మే 31) సరిగ్గా ఏడేళ్లు.

బన్నీ-పూరి కాంబోలో అప్పటికే దేశముదురు లాంటి బ్లాక్ బస్టర్ సినిమా వచ్చింది. అల్లు అర్జున్ ను ఎంత మాస్ గా చూపించాలో అంతే మాస్ గా చూపించి సక్సెస్ కొట్టాడు పూరి. మరోసారి అతడ్ని మాస్ యాంగిల్ లో ప్రజెంట్ చేస్తే రొటీన్ అయిపోతుంది. అందుకే ఇద్దరమ్మాయిలతో సినిమాలో మోస్ట్ స్టయిలిష్ అండ్ హ్యాండ్సమ్ హంక్ గా కనిపించాడు అల్లు అర్జున్.

ఫారిన్ బ్యాక్ డ్రాప్ కథ కావడంతో సినిమాలో దాదాపు మేజర్ పోర్షన్ ను స్పెయిన్, పారిస్ లో షూట్ చేశారు. అల్లు అర్జున్ తన కెరీర్ లో హయ్యస్ట్ డేస్ ఫారిన్ కంట్రీస్ లో గడిపిన సినిమా ఇదే.

Watch: ఇద్దరమ్మాయిలతో Full Movie

ఇక సినిమాలో హీరోయిన్ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఓ హీరోయిన్ గా అమలాపాల్ ను ఫిక్స్ చేశారు. ఇక్కడ ఎలాంటి సమస్య ఎదురుకాాలేదు. సెకెండ్ హీరోయిన్ కోసం ముందుగా రిచా గంగోపాధ్యాయను అనుకున్నారు. ఆమెను తప్పించి తాప్సిని తీసుకున్నారు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల తాప్సిని కూడా తప్పించి, క్యాథరీన్ ను తీసుకున్నారు. అలా బన్నీ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది క్యాథరీన్.

ఇక ఈ సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన ఎలిమెంట్ మ్యూజిక్. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు అదిరిపోయే ట్యూన్స్ అందించాడు. టాప్ లేచిపోద్ది, వయొలిన్ సాంగ్స్ ఇప్పటికీ హిట్టే. బన్నీ క్రేజ్ కు తోడు ఈ మ్యూజిక్ కూడా యాడ్ అవ్వడంతో ప్రీ-రిలీజ్ బిజినెస్ లో అప్పటికే అల్లు అర్జున్ క్రియేట్ చేసిన రికార్డుల్ని ఇద్దరమ్మాయితో సినిమా తుడిచిపెట్టింది.

అంతకుముందే జులాయి లాంటి పెద్ద హిట్ ఇవ్వడంతో.. ఇద్దరమ్మాయిలతో సినిమాకు ఓపెనింగ్స్ అదిరిపోయాయి. అటు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బండ్ల గణేష్ నిర్మించిన ఈ సినిమా వరల్డ్ వైడ్ 1600కు పైగా థియేటర్లలో విడుదలై, అప్పట్లో రికార్డు సృష్టించింది.