
బంపర్ ఆఫర్
నటీనటులు : సాయి రామ్ శంకర్, బిందు మాధవి
ఇతర నటీనటులు : సాయాజీ షిండే, చంద్ర మోహన్, కోవై సరళ, బ్రహ్మానందం, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎం.ఎస్, అలీ, జయప్రకాశ్, వేణు మాధవ్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : రఘు కుంచె
డైరెక్టర్ : జయ రవీంద్ర
ప్రొడ్యూసర్ : పూరి జగన్నాథ్
రిలీజ్ డేట్ : 23 అక్టోబర్ 2009
సాయి రామ్ శంకర్, మిందు మాధవి జంటగా జయ రవీంద్ర దర్శకత్వం లో స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ నిర్మించిన సినిమా ‘బంపర్ ఆఫర్’. ఓ లో క్లాస్ కూర్రాడికి హై క్లాస్ అమ్మాయి కి మధ్య జరిగే లవ్ స్టోరీ తో మాస్ ఎంటెర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో సాయి రామ్ శంకర్ ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్,బిందు మాధవి గ్లామర్, కోవై సరళ, ధర్మ వరపు, బ్రహ్మానందం, ఎమ్.ఎస్ కామెడీ, రఘు కుంచె మ్యూజిక్, షాయాజీ షిండే-సాయి రామ్ శంకర్ మధ్య వచ్చే సీన్స్ హైలైట్స్. అన్ని అంశాలు కలగలిపిన ఈ మాస్ ఎంటర్టైనర్ అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది.
=============================================================================

పంచాక్షరి
నటీనటులు : అనుష్క శెట్టి, చంద్ర మోహన్
ఇతర నటీనటులు : నాజర్, ప్రదీప్ రావత్, రవి ప్రకాష్, బ్రహ్మానందం, దివ్యవాణి, తెలంగాణ శకుంతల మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : చిన్నా
డైరెక్టర్ : V. సముద్ర
ప్రొడ్యూసర్ : బొమ్మదేవర రామ చంద్రరావు
రిలీజ్ డేట్ : 11 జూన్ 2010
హై ఎండ్ టెక్నికల్ వ్యాల్యూస్ తో తెరకెక్కిన ఫ్యామిలీ థ్రిల్లర్ పంచాక్షరి. దుర్గామాత గుడిలో పుట్టిన పంచాక్షరిని ఊళ్లూ వాళ్ళు దుర్గాదేవిలా ట్రీట్ చేస్తుంటారు. కానీ ఒక మహా పర్వదినాన పంచాక్షరి గుడిలో నిప్పుకు ఆహుతై పోతుంది. దాంతో దుర్గమ్మ వారే పంచాక్షరి ప్రాణాలు ఆహుతి చేశారు అనే భ్రమలో ఉంటారు ఊరి జనం. కానీ నిజం తరవాత బయటికి వస్తుంది, నిజానికి పంచాక్షరిని చంపింది ఎవరు..? ఆ తరవాత ఏం జరిగింది అనేదే ప్రధాన కథాంశం.
==============================================================================

తడాఖా
నటీనటులు : నాగచైతన్య, సునీల్, తమన్నా, ఆండ్రియా జెరెమియా
ఇతర నటీనటులు : ఆశుతోష్ రానా, నాగేంద్ర బాబు, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, రఘుబాబు, రమాప్రభ మరితు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : S. తమన్
డైరెక్టర్ : కిషోర్ కుమార్ పార్ధసాని
ప్రొడ్యూసర్ : బెల్లంకొండ సురేష్
రిలీజ్ డేట్ : 10th మే 2013
నాగచైతన్య, సునీల్ అన్నాదమ్ములుగా నటించిన ఇమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ తడాఖా. తండ్రి చనిపోగానే వచ్చిన పోలీసాఫీసర్ ఉద్యోగంలో ఇమడలేని అన్నకు తమ్ముడు ఎలాచేదోడు వాదోడుగా నిలిచాడు, కథ చివరికి ఏ మలుపు తిరిగిందనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం.
==============================================================================

కొత్తజంట
నటీనటులు :అల్లు శిరీష్ , రెజీనా
ఇతర నటీనటులు : మధు నందన్, సప్తగిరి, మధురిమ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : జె.బి
డైరెక్టర్ : మారుతి
ప్రొడ్యూసర్ : బన్నీ వాస్
రిలీజ్ డేట్ : మే 1 , 2014
అల్లు శిరీష్, రెజీనా జంటగా మారుతి దర్శకత్వం లో తెరకెక్కిన యూత్ ఫుల్ ఫామిలీ ఎంటర్టైనర్ చిత్రం ‘కొత్త జంట’ ఓ సందర్భం లో కలిసిన ఓ ఇద్దరు టి.వి. ప్రోగ్రాం ద్వారా ఎలా పరిచయం అయ్యి ప్రేమలో పడ్డారు అనే కధాంశం తో దర్శకుడు మారుతి తెరకెక్కించిన ఈ చిత్రం లో అల్లు శిరీష్, రెజీనా మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్, ప్రోగ్రాం కామెడీ, మ్యూజిక్ హైలెట్స్.
===========================================================================

బ్రూస్ లీ
నటీనటులు : రామ్ చరణ్, రకుల్ ప్రీత్ సింగ్
ఇతర నటీనటులు : అరుణ్ విజయ్, కృతి కర్బందా, నదియా, సంపత్ రాజ్, బ్రహ్మానందం, ఆలీ మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : S.S. తమన్
డైరెక్టర్ : శ్రీను వైట్ల
ప్రొడ్యూసర్ : D.V.V. దానయ్య
రిలీజ్ డేట్ : 16 అక్టోబర్ 2015
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కరియర్ లోనే డిఫెరెంట్ యాక్షన్ ఎంటర్ టైనర్ బ్రూస్ లీ. తన అక్క చదువు కోసం స్టంట్ మ్యాన్ గా మారిన యువకుడి క్యారెక్టర్ లో చెర్రీ పర్ఫామెన్స్ సినిమాకే హైలెట్ గా నిలిచింది. మెగాస్టార్ క్యామియో సినిమాకి మరో హైలెట్.
==============================================================================

బాబు బంగారం
నటీనటులు : వెంకటేష్, నయనతార
ఇతర నటీనటులు : సంపత్ రాజ్, మురళీ శర్మ, జయప్రకాష్, బ్రహ్మానందం, పోసాని కృష్ణ మురళి మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : జిబ్రాన్
డైరెక్టర్ : మారుతి
ప్రొడ్యూసర్ : S . నాగవంశీ, P . D . V . ప్రసాద్
రిలీజ్ డేట్ : 12 ఆగష్టు 2016
తాత జాలిగుణం వారసత్వం గా అందుకున్న కృష్ణ (వెంకటేష్) అనే పోలీస్ ఆఫీసర్ ఆ జాలి గుణం తోనే జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. ఒకానొక సందర్భం లో తన లాగే జాలి గుణం తో ఉండే శైలు (నయనతార) ను చూసి ఇష్టపడతాడు కృష్ణ. ఇక తాను ప్రేమిస్తున్న శైలు కుటుంబానికి ఎం.ఎల్.ఏ పుచ్చప్ప (పోసాని), మల్లేష్(సంపత్) లతో ఆపద ఉందని తెలుసుకున్న కృష్ణ ఆ ఫామిలీ ను అలాగే శైలు నాన్న ను ఎలా కాపాడాడు? చివరికి కృష్ణ ఆ ఇద్దరి ఆట ఎలా కట్టించాడు? అనేది చిత్ర కధాంశం.