సైరా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ డేట్ ఫిక్స్

Friday,September 13,2019 - 11:46 by Z_CLU

మెగాభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్న సైరా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు డేట్ ఫిక్స్ అయింది. ఈనెల 18న హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో ఈ వేడుకను గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు. ఈ మేరకు యూనిట్ నుంచి అఫీషియల్ గా ఎనౌన్స్ మెంట్ వచ్చేసింది. ఇదే వేదికపై నుంచి ట్రయిలర్ ను కూడా లాంఛ్ చేయబోతున్నారు.

ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రత్యేక అతిథిగా హాజరుకాబోతున్నాడు. పవన్ తో పాటు దర్శకధీరుడు రాజమౌళి, కొరటాల శివ, వీవీ వినాయక్ ప్రత్యేక అతిథులుగా హాజరవుతారు. వీళ్లతో పాటు తెలంగాణ మంత్రి కేటీఆర్ రావాల్సి ఉన్నప్పటికీ వేరే కార్యక్రమాల వల్ల ఆయన హాజరుకావడం లేదు.

ఇక సినిమాలో కీలక పాత్రలు పోషించిన అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, సుదీప్, తమన్న, నయనతార లాంటి నటులంతా ఈ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు హాజరవుతారు. నిజానికి ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ను ఇంకాస్త లేట్ గా, రిలీజ్ కు కాస్త ముందుగా చేయాలనుకున్నారు. కానీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఒకేసారి విడుదలవుతున్న సినిమా కావడంతో.. వివిధ ప్రాంతాల్లో తిరిగి ప్రచారం చేయాల్సి ఉంది. అందుకే ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ను ఇలా కాస్త ముందే నిర్వహిస్తున్నారు.