ఈ బాబుకి అప్పుడే నాలుగేళ్లు

Wednesday,August 12,2020 - 07:16 by Z_CLU

పోలీస్ అంటే ఎలా ఉండాలి? ఘర్షణ సినిమాలో వెంకటేష్ లా ఉండాలి. కానీ అదే పోలీస్ పాత్రను, అదే వెంకీ మరోలా చూపించి అందర్నీ అలరించాడు. ప్రేక్షకులతో “బాబు బంగారం” అనిపించుకున్నాడు. వెంకీ-మారుతి కాంబోలో వచ్చిన ఈ సినిమా విడుదలై ఇవాళ్టికి (ఆగస్ట్ 12) సరిగ్గా 4 ఏళ్లు అవుతోంది.

పోలీస్ కు జాలి-దయ ఉండవు. అతడిలోని అన్ని ఎమోషన్స్ ను ఖాకీ చొక్కా కప్పేస్తుంది. కేవలం కోపం, ఆగ్రహం మాత్రమే పైకి కనిపించేలా చేస్తుంది. కానీ Babu Bangaram లో వెంకీ పోషించిన ఏసీపీ కృష్ణ రోల్ మాత్రం ఎంతో ప్రత్యేకం. ఈ పోలీస్ కు ఎంత కోపం ఉంటుందో, అంతే జాలి కూడా ఉంటుంది. తనే రౌడీల్ని కొట్టి, మళ్లీ తనే వాళ్లకు ట్రీట్ మెంట్ ఇప్పించేంత జాలి ఈ హీరో సొంతం.

కొంచెం లాజికల్ గా ఆలోచిస్తే.. ఈ పాత్రను తెలుగులో వెంకటేష్ తప్ప మరో హీరో చేయలేడనిపిస్తుంది ఎవరికైనా.

ఇంతకుముందే చెప్పుకున్నట్టు Venkatesh కి పోలీస్ పాత్రలు కొత్తకాదు. కాకపోతే ఈ సినిమాను వెంకీ ఒప్పుకోవడానికి కారణం మాత్రం అతడి క్యారెక్టర్ లో ఉన్న ఈ జాలి అనే ఎలిమెంట్. అలా విక్టరీ వెంకటేష్ కెరీర్ లో డిఫరెంట్ మూవీగా నిలిచింది బాబు బంగారం. దీనికితోడు Venkatesh-Nayanthara ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కూడా కలిసొచ్చింది.

సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాకు మారుతి దర్శకుడు.