జీ సినిమాలు ( 10th డిసెంబర్)

Saturday,December 09,2017 - 10:03 by Z_CLU

మేము

నటీనటులు : సూర్య, అమలా పాల్

ఇతర నటీనటులు : రామ్ దాస్, కార్తీక్ కుమార్, విద్యా ప్రదీప్, బిందు మాధవి, నిశేష్, వైష్ణవి తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : ఆరోల్ కోలేరి

డైరెక్టర్ : పాండిరాజ్

ప్రొడ్యూసర్స్ : సూర్య, పాండిరాజ్

రిలీజ్ డేట్ : 24th డిసెంబర్ 2015

పిల్లల్లో హైపర్ ఆక్టివిటీని ఎలా హ్యాండిల్ చేయాలి అనే సెన్సిటివ్ టాపిక్ తో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మేము. ఈ సినిమాలో సూర్య, అమలా పాల్ నటన హైలెట్ గా నిలిచింది.

===========================================================================

శశిరేఖా పరిణయం 

హీరో హీరోయిన్లుతరుణ్ ,జెనీలియా

ఇతర నటీనటులుపరుచూరి గోపాలకృష్ణ, ఆహుతి ప్రసాద్, సుబ్బరాజు, రఘు బాబు తదితరులు

సంగీతం      –  మణిశర్మ, విద్య సాగర్

దర్శకత్వం  –  కృష్ణ వంశీ

విడుదల తేదీ – 2009

 వరుస ప్రేమ కథా చిత్రాలతో యూత్ లో మంచి ఫాలోయింగ్ అందుకొని లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్న తరుణ్ ను ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గర చేసిన చిత్రం ‘శశిరేఖ పరిణయం’. జెనీలియా శశి రేఖ గా నటించిన ఈ చిత్రం  2009 లో విడుదలైంది. ఈ చిత్రం తో తొలి సారిగా జత కట్టారు తరుణ్-జెనీలియా. కాబోయే భార్య భర్తల మధ్య ఎమోషనల్ సన్నివేశాలతో లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా బాగా అలరించింది. ఈ చిత్రం లో పెళ్లంటే భయపడే అమ్మాయి పాత్రలో  జెనీలియా నటన, ఒక అమ్మాయి గురించి తన జీవితం గురించి ఆలోచించే యువకుడి పాత్రలో తరుణ్ అందరినీ ఆకట్టుకున్నారు. తన ప్రతి సినిమాలో కుటుంబ విలువలను చాటి చెప్పే క్రియేటివ్ దర్శకుడు కృష్ణ వంశీ ఈ చిత్రాన్ని కూడా అదే కోవలో ఫ్యామిలీ అంశాలతో కూడిన లవ్ ఎంటర్టైనర్ గా రూపొందించి అలరించారు.

============================================================================

భగీరథ

నటీనటులు : రవి తేజ, శ్రియ

ఇతర నటీనటులుప్రకాష్ రాజ్, నాజర్,

మ్యూజిక్ డైరెక్టర్ : చక్రి

డైరెక్టర్ : రసూల్ ఎల్లోర్

ప్రొడ్యూసర్ :మల్లిడి సత్య నారాయణ రెడ్డి

రిలీజ్ డేట్ : అక్టోబర్ 13, 2005

రవి తేజ, శ్రియ హీరో హీరోయిన్స్ గా రసూల్ ఎల్లోర్ దర్శకత్వం లో తెరకెక్కిన సినిమా          ‘భగీరథ’. ఈ సినిమాకు ప్రస్తుతం టాప్ డైరెక్టర్ గా గుర్తింపు అందుకున్న కిషోర్ కుమార్ పార్ధసాని (డాలీ) కథ ను అందించారు. కృష్ణ లంక అనే పల్లెటూరి లో జనాలు పడే ఇబ్బందులను ఓ యువకుడు ఎలా పరిష్కరించాడు అనే కథతో ఫామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా లో రవి తేజ నటన, శ్రియ గ్లామర్, పల్లెటూరి సీన్స్, చక్రి పాటలు ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా రవి తేజ-ప్రకాష్ రాజ్ మధ్య వచ్చే పోటా పోటీ సీన్స్ అందరినీ అలరిస్తాయి.

===========================================================================

పాండు రంగడు

నటీనటులు : నందమూరి బాలకృష్ణ, స్నేహ, టాబూ

ఇతర నటీనటులు : అర్చన, మేఘనా నాయుడు, సుహాసిని, మోహన్ బాబు, K.విశ్వనాథ్, బ్రహ్మానందం, సునీల్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం

మ్యూజిక్ డైరెక్టర్ : కీరవాణి

డైరెక్టర్ : రాఘవేంద్ర రావు

నిర్మాత : కృష్ణమోహన రావు

రిలీజ్ డేట్ : 30 మే 2008

1957 లో NTR నటించిన పాండురంగ మహాత్యం సినిమాకి రీమేక్ ఈ “పాండు రంగడు” సినిమా. అన్నమయ్య, శ్రీరామ దాసు లాంటి సినిమాల తర్వాత బాలకృష్ణ తో కూడా ఒక భక్తిరస చిత్రం చేయాలనుకున్న రాఘవేంద్ర రావు ఈ సినిమాని తెరకెక్కించారు. పాండురంగనిగా బాలకృష్ణ నటన, దానికి తోడు కీరవాణి సంగీతం ప్రతీది సినిమాకు ప్రత్యేక ఆకర్షణే. బాలయ్య సరసన స్నేహ, టాబూ హీరోయిన్ లుగా నటించారు.

============================================================================

దోచెయ్

నటీనటులు  – నాగచైతన్య, కృతి సనోన్

ఇతర నటీనటులుబ్రహ్మానందం, రవిబాబు, పోసాని, సప్తగిరి, ప్రవీణ్

మ్యూజిక్ డైరెక్టర్  – సన్నీ

డైరెక్టర్  సుధీర్ వర్మ

రిలీజ్ డేట్ – 2015, ఏప్రిల్ 24

స్వామిరారా సినిమాతో అప్పటికే సూపర్ హిట్ అందుకున్న సుధీర్ వర్మకు పిలిచిమరీ ఛాన్స్ ఇచ్చాడు నాగచైతన్య. స్వామిరారా సినిమాతో తన మార్క్ ఏంటో చూపించిన సుధీర్ వర్మ… తన  రెండో ప్రయత్నంగా తీసిన దోచెయ్ సినిమాకు కూడా అదే ఫార్మాట్ ఫాలో అయ్యాడు. మహేష్ సరసన వన్-నేనొక్కడినే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కృతి సనోన్ కు ఇది రెండో సినిమా. అలా వీళ్లందరి కాంబోలో తెరకెక్కిన దోచెయ్ సినిమా కుర్రాళ్లను బాగానే ఎట్రాక్ట్ చేసింది. సన్నీ సంగీతం అదనపు ఆకర్షణ. క్లయిమాక్స్ కు ముందొచ్చే బ్రహ్మానందం కామెడీ టోటల్ సినిమాకే హైలెట్.