ఇయర్ ఎండ్ స్పెషల్ : సత్తా చూపించిన స్టార్ డైరెక్టర్లు

Sunday,December 30,2018 - 11:20 by Z_CLU

ప్రతీ ఏడాది కొందరు స్టార్ డైరెక్టర్లు బ్లాక్ బస్టర్ హిట్స్ తో టాలీవుడ్ ని ముందుకు నడిపిస్తుంటారు.  ఈ ఏడాది కూడా ముగ్గురు స్టార్ డైరెక్టర్లు తమ టాలెంట్ తో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకొని సక్సెస్ అయ్యారు. 2018 టాప్ హీరోలతో భారీ సినిమాలను తెరకెక్కించి  బ్లాక్ బస్టర్స్ అందుకున్న స్టార్  డైరెక్టర్స్ పై ‘జీ సినిమాలు’ స్పెషల్ స్టోరీ.

ఈ ఏడాది ‘రంగస్థలం’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి 2018 లో టాప్ ప్లేస్ లో నిలిచాడు సుకుమార్.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ని సరికొత్తగా ఆవిష్కరించి చిట్టి బాబు క్యారెక్టర్ తో మెస్మరైజ్ చేసాడు. ఓ సాదా సీదా రీవెంజ్ కథను 1980 బ్యాక్ డ్రాప్ లో తన శైలిలో తెరకెక్కించి ఎవరూ ఊహించని విధంగా ఎంటర్టైన్ చేసి బాక్సాఫీస్ దగ్గర కాసులవర్షం కురిపించాడు.

సూపర్ స్టార్ మహేష్ ని ముఖ్యమంత్రి గా ప్రెజెంట్ చేసి ఈ ఇయర్ ‘భరత్ అనే నేను’ తో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు కొరటాల శివ. పొలిటికల్ డ్రామాను తన స్టైల్ లో మాస్ కమర్షియల్ సినిమాగా తెరకెక్కించి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసాడు. మొదటి షో నుండే పాజిటీవ్ టాక్ తో దూసుకెళ్ళిన ‘భరత్ అనే నేను’ బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ సాధించి 2018 బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచింది.

ఈ ఏడాది ఆరంభంలో ‘అజ్ఞాతవాసి’ తో ప్రేక్షకులను నిరుత్సాహపరిచిన త్రివిక్రమ్ ‘అరవింద సమేత’ తో దసరా బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని మాస్ , క్లాస్ క్యారెక్టర్ లో చూపించి ఫాన్స్ ని ఖుషి చేసాడు. రైటర్ గా పదునైన మాటలతో అలరిస్తూనే తన మేజిక్ చూపించాడు. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ఇప్పటి వరకూ వచ్చిన సినిమాల్లో ‘అరవింద సమేత’ స్పెషల్ మూవీగా నిలిచింది.