KGF 2 - ప్రశాంత్ నీల్ కు అసలైన ఛాలెంజ్!

Wednesday,August 26,2020 - 04:05 by Z_CLU

ఒక ఇండస్ట్రీ హిట్ సినిమాకు సీక్వెల్ రాబోతుందంటే దానిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొనడం సహజమే. కానీ ఆ అంచనాలను అందుకోవడం మాత్రం చాలా కష్టం. ప్రతీ నిత్యం దర్శకుడిని అంచనాలు భయపెడుతుంటాయి. ఇప్పుడు ‘KGF2’ విషయంలో ప్రశాంత్ నీల్ పై అలాంటి ఒత్తిడే ఉంది. ఎవరూ ఊహించని విధంగా Prashanth Neel తెరకెక్కించిన ‘KGF’ విడుదల తర్వాత భారీ క్రేజ్ సంపాదించుకొని వసూళ్ళ సునామి సృష్టించింది. దీంతో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ సీక్వెల్ పై హైప్ పెరిగింది.

ఆ అంచనాలను అందుకొనేందుకు విపరీతంగా కష్టపడుతున్నారు ప్రశాంత్ అండ్ టీం. ఈ విషయంలో అంచనాలను మించి విజయం సాధించాడు Rajamouli. Baahubali గా వచ్చిన మొదటి పార్ట్ ను మించి సీక్వెల్ ఘన విజయం అందుకుంది. రికార్డులు తిరగరాసి ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ సినిమాకు ఓ రేంజ్ లో గుర్తింపు అందించింది. అందుకే ఇప్పుడు ప్రశాంత్ నీల్ ను జక్కన్న తో కంపేర్ చేస్తూ మొదటి పార్ట్ కి మించి రెండో పార్ట్ ను తీసి భారీ విజయం అందుకుంటాడా అంటూ మాట్లాడుకుంటున్నారు.

ఇక కరోనా కారణంగా కొన్ని నెలల గ్యాప్ తర్వాత ఈరోజే’ KGF 2′ బ్యాలెన్స్ షూట్ మొదలు పెట్టారు యూనిట్. ప్రకాష్ రాజ్ పై కొన్ని కీలక సన్నివేశాలు తీస్తున్నారు. మరి ఈ సీక్వెల్ అంచనాలను మించి విజయం అందుకుంటుందా వేచి చూడాలి.