Prashanth Neel ఆ ఇద్దరిలో ఎవరితో ?

Tuesday,April 12,2022 - 04:37 by Z_CLU

After NTR film who will be the Prashanth Neal’s next Hero ?

యష్ తో KGF చాప్టర్ 2 తీసి రిలీజ్ కి రెడీ చేసిన పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్ తో ‘సలార్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత మైత్రి మూవీ మేకర్స్ బేనర్ లో ఎన్టీఆర్ తో సినిమా చేయబోతున్నాడు ప్రశాంత్. ఎన్టీఆర్ -ప్రశాంత్ నీల్ కాంబో సలార్ కంటే ముందే లాక్ అయింది. కానీ కొన్ని రీజన్స్ వల్ల లేట్ అవుతూ వచ్చింది.

అయితే ఎన్టీఆర్ తర్వాత ప్రశాంత్ నీల్ లిస్టులో కొందరు స్టార్ హీరోల పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. అందులో ముఖ్యంగా అల్లు అర్జున్ అలాగే రామ్ చరణ్ పేర్లు కూడా వినబడుతున్నాయి. బన్నీ తో ప్రశాంత్ నీల్ సినిమా ఆన్ కార్డ్స్ అంటూ నిర్మాత బన్నీ వాస్ క్లారిటీ కూడా ఇచ్చారు. చరణ్ తో కూడా ప్రశాంత్ డిస్కషన్స్ జరిపాడు.

ఎన్టీఆర్ తో చేసే సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ ఈ ఇద్దరిలో ఎవరిని డైరెక్ట్ చేస్తాడనేది క్యూరియాసిటీ రైజ్ చేస్తుంది. KGF 1 తో తన సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పి భారీ కలెక్షన్స్ కొల్లగొట్టి పాన్ ఇండియా లెవెల్ లో రాజమౌళి తర్వాత రెండో స్థానంలో నిలిచాడు ప్రశాంత్. మరి ఇప్పుడు KGF 2, SALAAR సినిమాల తర్వాత ఈ డైరెక్టర్ ఇంకా నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళడం ఖయమనిపిస్తుంది. ఈ క్రమంలో మరి ప్రశాంత్ బన్నీ , చరణ్ ఇద్దరిలో ఎవరితో సినిమా చేస్తాడో చూడాలి.

Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics