Balayya-Boyapati : మోనార్క్ కాదు డేంజర్

Wednesday,August 26,2020 - 04:12 by Z_CLU

బాలయ్య-బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాకు మొన్నటివరకు మోనార్క్ అనే టైటిల్ వార్తల్లో నిలిచింది. అయితే ఇప్పుడీ టైటిల్ స్థానంలో మరో కొత్త పేరు పుట్టుకొచ్చింది. ఈసారి సినిమాకు డేంజర్ అనే టైటిల్ పెట్టినట్టు వార్తలొస్తున్నాయి.

మోనార్క్ టైటిల్ బాగున్నప్పటికీ అందులో నెగెటివ్ షేడ్స్ కనిపిస్తున్నాయనే టాక్ బయటకొచ్చింది. మరీ ముఖ్యంగా మాస్ అప్పీల్ బలంగా ఉన్న Balakrishna లాంటి హీరోకు మోనార్క్ అనే టైటిల్ పెడితే.. సి-సెంటర్ ఆడియన్స్ ఒప్పుకోరనే వాదన తెరపైకొచ్చింది. దీంతో ఇప్పుడు మోనార్క్ స్థానంలో Danger అనే టైటిల్ గట్టిగా వినిపిస్తోంది.

నిజానికి డేంజర్ అనే టైటిల్ కూడా Balakrishna-Boyapati సినిమాపై ఉన్న అంచనాలకు తగ్గ టైటిల్  కాదు. సింహా, లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చింది ఈ కాంబినేషన్. అదే తరహాలో, అంచాలకు తగ్గట్టు మరో భారీ టైటిల్ పెట్టాలి. కానీ ఆశ్చర్యంగా.. మోనార్క్, డేంజర్ లాంటి మీడియం రేంజ్ హీరోలు పెట్టుకునే టైటిల్స్ తెరపైకొస్తున్నాయి. ఈ గాసిప్ నిజం కాకూడదనే కోరుకుందాం