KGF2 - శాటిలైట్ రైట్స్ సొంతం చేసుకున్న ZEE సౌత్ క్లస్టర్

Friday,August 20,2021 - 06:29 by Z_CLU

– ‘కె. జి. ఎఫ్ – 2’ శాటిలైట్ రైట్స్ ను సొంతం చేసుకున్న జీ తెలుగు, జీ కన్నడ, జీ తమిళ్ మరియు జీ కేరళమ్.
హోంబలే ఫిల్మ్స్ పతాకంపై ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో రాకింగ్ స్టార్ యశ్ నటించిన కె.జి. ఎఫ్-2 సినిమా హక్కులు జీ సౌత్ క్లస్టర్ సొంతం చేసుకుంది 

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో, కన్నడ రాక్ స్టార్ యశ్ హీరోగా నటించిన భారీ యాక్షన్ చిత్రం ‘కే.జీ.ఎఫ్ ఛాప్టర్-1’ ఏ రేంజ్ సక్సెస్ సాధించిందో అందరికీ తెలిసింది. మాస్ ఫైటింగులు, అద్భుతమైన సెట్టింగులు, భారీగా ఎలివేషన్లు, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సినిమాలో ప్రతీ అంశం యావత్ భారతదేశ సినీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అద్భుతమైన క్లైమాక్స్ తో ముగిసిన ఈ సినిమా తదుపరి కథ ‘కే.జీ.ఎఫ్ ఛాప్టర్-2’ లో తెలియనుంది. దీంతో ఇప్పుడు ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

వాళ్ళందరికి ఊరట ఇవ్వడానికి ఈ సినిమా సీక్వెల్, KGF ఛాప్టర్ 2 టీజర్ రిలీజ్ చేయగా, ట్విట్టర్ యూట్యూబ్ లలో ట్రెండింగ్ నిలవడమే కాకుండా, డిజిటల్ 208 మిలియన్ వీక్షణలను సంపాదించింది. జీ నెట్ వర్క్ యొక్క 4 దక్షిణ ఛానల్ లు ఇప్పుడు ఈ సినిమాకు శాటిలైట్ రైట్స్ ని స్వాధీనం చేసుకున్నాయి.


ఈ సందర్భంగా EVP & క్లస్టర్ హెడ్ సౌత్ బిజినెస్ సీజు ప్రభాకరస్ మాట్లాడుతూ, జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ZEEL), “కె.జి.ఎఫ్ చాప్టర్ 2 శాటిలైట్ రైట్స్ ద్వారా దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమాను దక్షిణాదిలోని ప్రతి తెరపైకి తీసుకురావడం మాకు చాలా సంతోషంగా ఉంది.
మొత్తం 4 దక్షిణ భాషలలో ప్రేక్షకులకు వారి సౌకర్యం, భద్రతలో వినోదాన్ని అందించేందుకు మేము ఎల్లప్పుడూ అడుగులు వేస్తాం. ఈ అసోసియేషన్ ద్వారా మరోసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా ఛానల్ అభిమానులకు మమల్ని ఇంకా దగ్గరచేస్తుందని భావిస్తున్నాము.”

తెలుగు క్లస్టర్ హెడ్ అనురాధ గూడూరు మాట్లాడుతూ, “జీ లో, మేము తీసుకునే ప్రతి నిర్ణయం ప్రేక్షకుల ఆలోచనలను దృష్టిలో పెట్టుకొని తీసుకుంటాం. మన కధలు మన మార్కెట్లో మాత్రమే కాకుండా భారతదేశమంతటా ప్రేక్షకులను అలరిస్తున్నాయి. అలాంటి తరుణంలో తెలుగుతో సహా మిగతా 3 దక్షిణ భాషలలో కె.జి. ఎఫ్-2 శాటిలైట్ రైట్స్ సొంతం చేసుకోవడం. మాకు సంతోషంగా ఉంది. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన బ్లాక్ బస్టర్ చిత్రాలతో మా అనుబంధం ఈ విధంగా ఇంకా బలపడనుంది. మారుతున్న
కాలంతో పాటు, ప్రేక్షకుల అంచనాలకు అనుగుణంగా మా యొక్క కథలు ఉండడం అందరికి తెలిసిందే. అలాంటి కథల మధ్య కె. జి.ఎఫ్-2 దాని కంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంది. కథనంలో వైవిధ్యం. నాణ్యత ఉన్న కథలని ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రేక్షకులకు అందించాలని మేము ఎల్లప్పుడూ ప్రయత్నిస్తాం. ఈ సినిమా వీక్షకులకు నచ్చుతుందని అలాగే ఎంటర్టైన్మెంట్ అడ్రస్ గా మారుతుందని భావిస్తున్నాను.”

దర్శకుడు ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ, “కె. జి. ఎఫ్ 2 శాటిలైట్ హక్కులు జీ సొంతం చేసుకున్నందుకు, అలాగే వారి ద్వారా దక్షిణాది ప్రేక్షకులకు మేము ఇంకా దగ్గరవుతునందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. సినిమా టీజర్ కు వచ్చిన రెస్పాన్స్ చూసి నేను థ్రిల్ ఫీల్ అయ్యాను. అందరి అంచనాలకు అనుగుణంగా ఉంటుందని, అలాగే కె. జి.ఎఫ్ లెగసి ని ఇంకో తారాస్థాయికి తీసుకెళుతుందని నా నమ్మకం.”

జీ నెట్ వర్క్ తో అసోసియేషన్ గురించి హోంబలే ఫిల్మ్స్ నిర్మాత విజయ్ కిర్గందూర్ మాట్లాడుతూ, “జీ నెట్వర్క్ తో ఈ అసోసియేషన్ మాకు చాలా సంతోషంగా ఉంది. జీ ద్వారా మేము ఇంకా ప్రేక్షకులకు దగ్గరవుతామని భావిస్తున్నాను. హాంబలే ఫిల్మ్స్ ఎప్పుడు కూడా కథకు ప్రాధాన్యతనిస్తూ, అందరిని ఆకట్టుకునేలా రూపొందించడానికి మేము ప్రయత్నిస్తాము..”

కె. జి. ఎఫ్ ఛాప్టర్ 1 రికార్డు స్థాయిలో విజయం సాధించిన తర్వాత, కె. జి.ఎఫ్ ఛాప్టర్ 2 మీద అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా ట్రైలర్ యాక్షన్ థ్రిల్లర్ అంచనాలను మరింతగా పెంచింది. “కె. జి. ఎఫ్ చాప్టర్ 2 ని అభిమానుల అంచనాలకి తగట్టుగా, చాప్టర్ 1 లెగసీని ముందుకు తీసుకెళుతూ, అత్యుత్తమ సినిమాను అందించడానికి ప్రయత్నించాము. కె.జి. ఎఫ్ చాఫ్టర్ 2 ని కూడా అందరూ అంతే ప్రేమ & ఆప్యాయతతో ముంచెత్తుతారని, ఇది మరొక బెంచ్ మార్క్ గా నిలుస్తుందని అనుకుంటున్నాను” అని చెప్పారు విజయ్ కిర్గందూర్.

 

కె.జి.ఎఫ్ మరియు ఈ అసోసియేషన్ గురించి రాకింగ్ స్టార్ యశ్ మాట్లాడుతూ “కె. జి. ఎఫ్ 2 కి నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంది. నా దర్శకుడు ప్రశాంత్ నీల్, నిర్మాత విజయ్. కిర్గందూర్, నేను నమ్మిన కథను ప్రేక్షకులు ఇంతలా ఆదరించినందుకు కృతజ్ఞతలు. తెలుపుతున్నాను. యావత్ భారతదేశ ప్రేక్షకులు ఇచ్చిన మద్దతు అపారమైనది. జీ ప్రారంభమైనప్పటి నుండి భారతీయ ప్రేక్షకులను అలరిస్తూ వచ్చింది. జీ సౌత్ క్లస్టర్ ఈ విధంగా అసోసియేట్ అవడం నాకు సంతోషంగా ఉంది. ఇదే విధంగా మా ప్రయాణం వీళ్ళతో కలిసి ముందుకు కొనసాగించాలని ఆశిస్తున్నాను.’

హోంబలే ఫిల్మ్స్ పతాకంపై ప్రశాంత్ నీల్ దర్శకత్వం ఈ సినిమాలో రాకింగ్ స్టార్ యశ్, శ్రీనిధి శెట్టి, సంజయ్ దత్ మరియు రవీనా టాండన్ ప్రధాన పాత్రలు పోషించారు.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending
    stories, Gossips, Actress Photos and Special topics