ఫోకస్ మొత్తం అనుష్కపైనే...

Tuesday,January 15,2019 - 10:08 by Z_CLU

‘భాగమతి’ సినిమా తరవాత మళ్ళీ న్యూస్ లోకి రాలేదు అనుష్క. అందుకే అనుష్క సంతకం చేయబోయే నెక్స్ట్ సినిమా ఏమిటనే క్యూరియాసిటీ ఫ్యాన్స్ లో క్రియేట్ అయింది. అయితే ఆ సస్పెన్స్ ని ‘సైలెన్స్’ తో బ్రేక్ చేసింది అనుష్క. అదే అనుష్క నెక్స్ట్ సినిమా టైటిల్.

అయితే ఈ సినిమాలో అనుష్క లీడ్ రోల్ ప్లే చేస్తుంది. ఈ సినిమా ఎగ్జాక్ట్ స్టోరీలైన్ ఏంటనేది ప్రస్తుతానికి రివీల్ కాలేదు కానీ, సినిమా మాత్రం మ్యాగ్జిమం U.S. లోనే తెరకెక్కించనున్నారు మేకర్స్. ఈ సినిమా మార్చి నుండి సెట్స్ పైకి రానుంది.

ఈ సినిమాలో మాధవన్ కీ రోల్ ప్లే చేస్తున్నాడు. అంజలి, షాలినీ పాండే సినిమాలోని ఇంపార్టెంట్ రోల్స్ లో కనిపించనున్నారు. కోన ఫిల్మ్ కార్పొరేషన్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ పై తెరకెక్కనున్న ఈ సినిమాకి హేమంత్ మధుకర్ డైరెక్టర్. గోపీ సుందర్ మ్యూజిక్ కంపోజర్.