రిలీజ్ డేట్స్ మారిన సినిమాలు

Wednesday,February 13,2019 - 02:00 by Z_CLU

ఒక సినిమా సెట్స్ పైకి వచ్చిందంటే ఫ్యాన్స్ లో ఇమ్మీడియట్ గా రేజ్ అయ్యే క్వశ్చన్ రిలీజ్ డేట్. అందుకే సినిమా సెట్స్ పైకి వచ్చీ రాగానే, ఆల్మోస్ట్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసేస్తారు మేకర్స్. అయితే ఈ మధ్య వరసగా కొన్ని సినిమాల రిలీజ్ డేట్స్ మారాయి.. అవేంటో చూద్దాం…

 

ABCD : సినిమా సెట్స్ పైకి వచ్చాక అనౌన్స్ చేసిన డేట్ ఫిబ్రవరి 8. ఈ డేట్ ప్రకారం ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ అవ్వాలి. కానీ సినిమా ఆ తరవాత మార్చి 1 కి షిఫ్ట్ అయింది. అంతలో ఏం జరిగిందో పెద్దగా క్లారిటీ లేదు కానీ  ఫైనల్ గా మార్చి 21 న రిలీజ్ అవుతుంది ABCD.. ఈ కన్ఫూజ్డ్ దేశీ జెనెరేట్ చేసే ఫన్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్.

మహర్షి : టాలీవుడ్ మోస్ట్ అవేటెడ్ మూవీ. ఈ సినిమా చుట్టూ క్రియేట్ అయి ఉన్న డిమాండ్ కి తగ్గట్టే, ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నారు మేకర్స్ ఈ సినిమాని.  అయితే రిలీజ్ డేట్ విషయానికి వచ్చేసరికి ‘మహర్షి’ టీమ్ కి కూడా తప్పలేదు. ఏప్రిల్ 5 న రిలీజ్ అని ముందే అఫీషియల్ గా అనౌన్స్ చేసినా, పక్కన ఇంకో డిజిట్ చేర్చి 25 న రిలీజ్ చేస్తున్నారు.

 

మహానాయకుడు : ‘కథానాయకుడు’ రిలీజ్ తరవాత ‘మహానాయకుడు’ సినిమా విషయంలో చాలా నిర్ణయాలు తీసుకుంది టీమ్. అఫీషియల్ గా ఎక్కడ మెన్షన్ చేయలేదు కానీ, మహా నాయకుడు స్క్రీన్ ప్లే విషయంలో కూడా చాలా మార్పులు జరిగాయని తెలుస్తుంది. అందుకే వీటన్నింటిని మైండ్ లో పెట్టుకునే సరిపడా టైమ్ కావాలనే ఉద్దేశంతోనే ఫిబ్రవరి 8 నుండి 22 కు షిఫ్ట్ అయ్యారు మేకర్స్.

అర్జున్ సురవరం : ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా కనిపించనున్నాడు నిఖిల్ ఈ సినిమాలో. అయితే ఈ సినిమా విషయంలో జస్ట్ రిలీజ్ డేట్ ఒక్కటే కాదు, టైటిల్ కూడా మారింది. ‘ముద్ర’ గా రావాల్సిన ఈ సినిమా ‘అర్జున్ సురవరం’ గా వస్తుంది. ఇక రిలీజ్ డేట్ విషయానికి వస్తే ఫిబ్రవరి నుండి మార్చి 29 కి షిఫ్టయింది.

 

 

జెర్సీ : సమ్మర్ లో ఎన్ని సినిమాలు లైనప్ అయి ఉన్న ‘జెర్సీ’ ఫై మాత్రం స్పెషల్ ఫోకస్ ఉంది. ఈ సినిమా చుట్టూ క్రియేట్ అవుతున్న డిమాండ్ కి తగ్గట్టే, ఏప్రిల్ 19 అని అఫీషియల్ గా కన్ఫమ్ చేసినా, ఆల్మోస్ట్ డేట్ చేంజ్ అవుతుందనే రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. షూటింగ్ కంప్లీట్ చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో చేసుకుంటున్న మేకర్స్ మరి ఈ రిలీజ్ డేట్ ని ప్రీ పోన్ చేస్తారా..? పోస్ట్ పోన్ చేస్తారా.? లేకపోతే ఈ డేట్ కే ఫిక్సవుతారా అనేది చూడాలి.