అనిల్ రావిపూడి... నెక్స్ట్ ఏంటి ?

Sunday,December 01,2019 - 02:08 by Z_CLU

నాలుగు సినిమాలకే స్టార్ డైరెక్టర్ లిస్టులో చేరిపోయాడు అనిల్ రావిపూడి. ప్రస్తుతం మహేష్ తో ‘సరిలేరు నీకెవ్వరు’ తెరకెక్కిస్తున్న ఈ దర్శకుడు సినిమాను సంక్రాంతికి రెడీ చేసేశాడు. ఈ సినిమా తర్వాత అనిల్ ప్లాన్ ఏంటి అతను డైరెక్ట్ చేయబోయే స్టార్ ఎవరు అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

లేటెస్ట్ గా అనిల్ రావిపూడి రామ్ కి ఓ కథ వినిపించాడనే టాక్ వినిపిస్తుంది. నిజానికి అనిల్ తన మూడో సినిమాను రామ్ తో చేయాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల ఈ కాంబినేషన్ కుదరలేదు. అందుకే ఇప్పుడు రామ్ తో ఓ సినిమా తీసేందుకు రెడీ అవుతున్నాడని అంటున్నారు. మరి అనిల్ తన నెక్స్ట్ సినిమాపై క్లారిటీ ఇచ్చే వరకూ ఇందులో నిజమెంత అనేది తెలియదు.