బన్నీ ఆ డైరెక్టర్ తోనే ఫిక్స్ ?

Sunday,December 01,2019 - 01:00 by Z_CLU

‘అల వైకుంఠపురములో’ షూటింగ్ ఫినిషింగ్ స్టేజిలో ఉంది. ఈ సినిమా తర్వాత సుకుమార్ తో సినిమా చేస్తున్నాడు అల్లు అర్జున్. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ నుండి సెట్స్ పైకి రానుంది. ఈ సినిమా తర్వాత బన్నీ ‘ఐకాన్’ సినిమా చేయాల్సి ఉంది.

కానీ ఇంత వరకూ ఆ సినిమా షూటింగ్ ఎప్పుడనేది బయటికి రావడం లేదు. తాజా సమాచారం ప్రకారం బన్నీ ‘ఐకాన్’ కంటే ముందే మురుగదాస్ తో ఓ సినిమా ప్లాన్ చేసుకుంటున్నాడట. ఈ సినిమాకు సంబంధించి ఫిబ్రవరి నుండి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరగనుందని… తమిళ్ , తెలుగులో బైలింగ్వెల్ సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమా సమ్మర్ నుండి షూట్ జరుపుకోనుందని తెలుస్తుంది. త్వరలోనే బన్నీ చేయబోయే ఈ సినిమాపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది.