RRR టైటిల్ మారిపోయి ఉండేది

Wednesday,March 20,2019 - 10:01 by Z_CLU

RRR సినిమా అనౌన్స్ చేసినప్పుడు ఈ సినిమాలో మహేష్ బాబు ఎందుకు లేడా…? అనే ఆలోచన ఎవరికీ రాలేదు. రీసెంట్ గా ప్రెస్ మీట్ లో సినిమా అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ ల రియల్ క్యారెక్టర్స్ చుట్టూ అని రివీల్ చేశాక వచ్చింది. దానికీ ఓ కారణం ఉంది. గతంలో సూపర్ స్టార్ కృష్ణ అల్లూరి సీతారామరాజు గా చేశాడు కాబట్టి మహేష్ బాబును ప్రిఫర్ చేస్తే బావుండేదని కొందరి ఫీలింగ్…. అది సరే ఇప్పుడు ఇదే వరసలో అల్లు అర్జున్ పేరు వినిపిస్తుంది. అయితే దానికీ ఓ కారణం ఉంది.

గతంలో గోన గన్నారెడ్డి పాత్ర చేశాడు బన్నీ. అది కూడా హిస్టారికల్ క్యారెక్టరే. రుద్రమదేవి సినిమాలో బన్ని పర్ఫామెన్స్ కి టోటల్ టాలీవుడ్ మెస్మరైజ్ అయిపోయింది. తెలంగాణ యాసలో మాట్లాడటం దగ్గరి నుండి, ఆ క్యారెక్టర్ లో న్యాచురల్ గా సింక్ అయిన విధానం… రుద్రమదేవి సినిమా అంతా ఓ వైపు, అల్లు అర్జున్ ఓ వైపు అనిపించుకుంది. తెలంగాణ ప్రాంతానికి చెందిన కొమురం భీమ్ పాత్రను బన్నీ చేసినా బాగుంటుందనేది ఓ సెక్షన్ ఫ్యాన్స్ ఆలోచన. 

 

రాజమౌళి ఏదైనా డెసిషన్ తీసుకున్నాడంటే కంపల్సరీగా రీజన్ ఉంటుంది, ఫ్యాన్స్ కి అందులో అనుమానం కూడా లేదు. అందునా రామ్ చరణ్, NTR లాంటి స్టార్స్ ని ఒకేసారి సిల్వర్ స్క్రీన్ పై చూసుకునే అవకాశం వస్తుందంటే ఎవరు కాదనుకుంటారు… కానీ ఎక్కడో రాజమౌళి ఆలోచనలకి బన్ని నిజంగానే తట్టలేదా..? అనే పాయింట్ అయితే ఫ్యాన్స్ లో చక్కర్లు కొడుతుంది.

రామ్ చరణ్ , NTR ల కాంబినేషన్ లో RRR… ఇంతకన్నా బెస్ట్ ఊహించుకోవడానికి కూడా లేదు కానీ, ఒకవేళ ఫ్యాన్స్ క్యాలిక్యులేషన్స్ కుదిరి, సినిమా మహేష్ బాబు, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చి ఉంటే రాజమౌళి కొత్త హీరోలతో చేసినట్టూ ఉండేది. మరీ ముఖ్యంగా సినిమా టైటిల్ కూడా మారిపోయి ఉండేది.