మెగాస్టార్ సినిమాలో సీనియర్ క్యారెక్టర్...?

Wednesday,November 06,2019 - 10:03 by Z_CLU

మెగాస్టార్ 152 సినిమా ఫాస్ట్ పేజ్ లో ప్రీ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. సినిమాలో త్రిష హీరోయిన్ అంటూ టాక్ కూడా గట్టిగానే వినిపిస్తుంది. అయితే ఇప్పుడు ఫిక్స్ అవ్వాల్సింది సినిమాలో సీనియర్ క్యారెక్టరేనా…? కొరటాల కథలు ఓ ఫార్మాట్ లో ఉంటాయి. హీరో ఓ పర్టికులర్ సమస్యపై కాన్సంట్రేషన్ చేశాడంటే, దాని వెనకాల ఓ సీనియర్ క్యారెక్టర్ ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పటి వరకు కొరటాల చేసిన సినిమాలన్నింటిలో ఈ సీనియర్ రోల్స్ కీలక పాత్ర పోషించాయి.

మిర్చి : సినిమా బిగినింగ్ లో హీరో క్యారెక్టర్ హ్యాప్పీ గోయింగ్ యంగ్ స్టరే. ఎప్పుడైతే హీరో లైఫ్ లో తండ్రి ప్రస్తావన వస్తుందో అక్కడి నుండే అసలు కథ మొదలవుతాయి. ఈ క్యారెక్టర్ ని సత్యరాజ్ ప్లే చేశాడు. ఈ సీనియర్ రోల్ చుట్టే అసలు కథ నడుస్తుంది.

శ్రీమంతుడు : ఈ సినిమా పేరెత్తగానే హీరో ఊరిని దత్తత తీసుకోవడం అనే పాయింట్ గుర్తుకొస్తుంది కానీ, నిజానికి సినిమాలో హీరో కన్నా ముందు ఆ ఊరితో కనెక్షన్ ఉన్న క్యారెక్టర్ రవికాంత్ దే. ఈ క్యారెక్టర్ ని జగపతిబాబు ప్లే చేశాడు. మహేష్ బాబుకి తండ్రిగా కనిపించాడు ఈ సినిమాలో.

జనతా గ్యారేజ్ : ఈ సినిమాలో కీ రోల్ ప్లే చేసిన సీనియర్ క్యారెక్టర్ మోహన్ లాల్. హీరోని ముంబైకి వెళ్ళేలా చేయడానికి కొరటాల మంచి కారణం రాసుకున్నా, హీరో క్యారెక్టర్ కి అసలు లక్ష్యం క్రియేట్ అయ్యేది ఈ క్యారెక్టర్ వల్లే. ఈ సినిమాలో NTR కి పెదనాన్న గా నటించాడు మోహన్ లాల్.

భరత్ అనే నేను – ఎప్పుడూ ఏదో నేర్చుకోవాలి.. కొత్త విషయాలు తెలుసుకోవాలి అనే రెగ్యులర్ యంగ్ స్టర్. అసలు ఈ క్యారెక్టర్ కి తండ్రి చనిపోయేంత వరకు అసలు ఇండియాకి తిరిగి రావాలనే ఆలోచన కూడా ఉండదు. అనుకోకుండానే రాష్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తరవాతే అసలు కథ మొదలవుతుంది. ఈ సీనియర్ రోల్ శరత్ కుమార్ ప్లే చేశాడు.

ఇప్పటి వరకు చేసిన 4 సినిమాల్లోనూ ఎక్కడా ఫార్మాట్ మార్చలేదు కొరటాల. మరి మెగాస్టార్ సినిమాలో కూడా ఇలాంటి సీనియర్ క్యారెక్టర్ ఉంటుందా..? ఉంటే ఆ క్యారెక్టర్ ని ఎవరు ప్లే చేస్తారు..? మేకర్స్ ఇప్పటికే ఈ విషయంలో డెసిషన్ తీసుకున్నారా…? ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్ దొరకాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే.