న్యాచురల్ స్టార్ నాని లెక్క మార్చినట్టేనా...?

Wednesday,November 06,2019 - 11:03 by Z_CLU

‘న్యాచురల్ స్టార్’ అనే ఇమేజ్ నానికి 100% సూటవుతుంది. ఆ ట్యాగ్ కి తగ్గట్టే చేసే ప్రతి సినిమాలో తన క్యారెక్టర్ అంతే న్యాచురల్ గా ఉండేలా ప్లాన్ చేసుకుంటాడు. అయితే అది ఇప్పటి వరకు… 12 ఏళ్ళలో సక్సెస్ ఫుల్ గా 24 సినిమాలు కంప్లీట్ చేసుకున్న నాని తన 25 వ సినిమాతో లెక్క మారుస్తున్నాడనిపిస్తుంది.

నాని తన 25 వ సినిమాలో విలన్ కనిపించబోతున్నాడు. అయితే ఇదేదో అనుకోకుండా కథ కలిసొచ్చి, క్యారెక్టర్ నచ్చేసి నాని ఈ డెసిషన్ తీసుకున్నాడని అస్సలు అనిపించట్లేదు. 25 వ సినిమా ఖచ్చితంగా ఇలాగే ఉండాలి… ఇకపై చేయబోయే సినిమాలు కూడా ఈ సినిమా తరహాలోనే ఉండాలని ఫిక్సయి నాని ఈ సినిమా ప్లాన్ చేసుకున్నాడనిపిస్తుంది.

మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘V’ లో వయొలెన్స్ ఉండబోతుందని స్ట్రేట్ గానే అనౌన్స్ చేశాడు నాని. దానికి తోడు ఈ సినిమా అల్ట్రా కమర్షియల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతున్న కాప్ డ్రామా అని కూడా తెలుస్తుంది. ఈ సినిమాలో ‘నాని…’ మెయిన్ విలన్.

ఒక్క మాటలో చెప్పాలంటే నాని రెగ్యులర్ సాఫ్ట్ క్యారెక్టర్స్ నుండి మాస్ మోడ్ లోకి షిఫ్ట్ అవుతున్నాడని క్లియర్ గా తెలుస్తుంది. ఇప్పటి వరకు న్యాచురల్ క్యారెక్టర్స్ లో మెస్మరైజ్ చేసిన నాని ఇకనుండి లెక్క మార్చి తనలోని మాసిజం ఎలివేట్ చేసే కథల్ని ఎంచుకుంటాడనిపిస్తుంది.