కొరటాల స్ట్రిక్ట్ గా ఫాలో అవుతున్న 3 రూల్స్

Wednesday,November 06,2019 - 09:02 by Z_CLU

కొరటాల శివ… ఇప్పటి వరకు దర్శకుడిగా చేసింది 4 సినిమాలు. రెబల్ స్టార్ ప్రభాస్ ‘మిర్చి’ తో స్టార్ట్ అయితే ఇప్పుడు మెగాస్టార్ సినిమా కోసం చేస్తున్న ప్రిపరేషన్స్ ని గమనిస్తే కొరటాల 3 రూల్స్ ని తూ.చ. తప్పకుండా పాటిస్తున్నాడనిపిస్తుంది. ఇప్పుడు మెగాస్టార్ కోసమైనా ఎక్కడైనా తగ్గే అవకాశాలున్నాయేమోనని అప్పట్లో అనిపించినా… ఈ మాసివ్ డైరెక్టర్ ఏ మాత్రం బ్రాండ్ మార్క్ ని మార్చుకోలేదు.

మెసేజ్ కంపల్సరీ : కొరటాల సినిమాల్లో మెసేజ్ కంపల్సరీ. అలాగని ఎంతసేపు సినిమాని నీతులతో నింపేస్తాడా..? అంటే అస్సలు కాదు… కథలో ఇంటర్నల్ గా మెసేజ్ ఉంటుంది. సినిమా ట్రావెల్ అయ్యేది అల్టిమేట్ గా న్యూ ఏజ్ కమర్షియల్ ఎలిమెంట్స్ పైనే. కానీ మెసేజ్ లేకుండా మాత్రం సినిమా ఉండదు.

దేవి శ్రీ ప్రసాద్ : కొరటాల సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేస్తే అది D.S.P. నే. కనీసం ‘కొత్తగా ఉంటుందేమో ట్రై చేసి చూద్దాం…’ అనే ఆలోచన కూడా రాదు. ఈ దర్శకుడు సినిమా చేస్తున్నాడంటే  DSP తప్ప ఇంకో ఆప్షన్ ఆలోచించడు…

రిపీట్ చేయడు  : కథ రెడీ అవ్వగానే హీరోని ఫిక్సయిపోతాడు. ఒక్కోసారి అవకాశాన్ని బట్టి హీరోని రిపీట్ చేస్తాడు కానీ, ఎట్టి పరిస్థితుల్లో హీరోయిన్స్ ని రిపీట్ చేయడు.