ఏం జరుగుతోంది...?

Wednesday,September 28,2016 - 11:56 by Z_CLU

వెండితెర పై మాస్ మహారాజ్ సంతకం పడి పది నెలలు దాటింది. గత సంవత్సరం డిసెంబర్ 10 న రిలీజైన బెంగాల్ టైగర్ యావరేజ్ గా ఆడినా రవితేజ ఎనర్జీకి పర్ఫార్మెన్స్ కి ఫుల్ మార్కులే పడ్డాయి. కానీ ఆ తరవాత రవితేజ సినిమాల ఊసు లేకుండా పోయింది. ఇంతకీ ఏం జరుగుతుంది..? స్టోరీస్ డిస్కషన్ స్టేజ్ లో ఉన్నాయని ఓ సారి, ఇక మాస్ మహారాజ్ సినిమా సెట్ పైకి వచ్చేసినట్టే అని మరోసారి రకరకాల కథనాలు వినిపిస్తున్నా ఇప్పటి వరకైతే ఒక్క సినిమా కూడా అఫీషియల్  కాలేదు.

ravi-bobby-1-1

ఆ మధ్య సర్దార్ గబ్బర్ సింగ్ డైరెక్టర్ బాబీ తో సినిమా పక్కా అయింది అనిపించుకున్నా ఇప్పటి వరకు ఆ సినిమాకి ముహూర్తం షార్ట్ కూడా పడలేదు. సినిమా సినిమాకి గ్యాప్ ఉండాలి కానీ ఇంతలా ఉండకూడదు అన్న విషయం మాస్ మహారాజ్ కి తెలియనిది కాదు. ఇన్ సైడ్ సోర్సెస్ ని బట్టి దసరా కల్లా బాబీ దర్శకత్వంలో సినిమాని సెట్స్ పైకి తేవాల్సిందే అని రవితేజ డిసైడ్ అయ్యాడని సమాచారం.