అతడు మళ్లీ వస్తున్నాడు...

Wednesday,September 28,2016 - 02:34 by Z_CLU

మాటల మాంత్రికుడు మళ్ళీ సూపర్ స్టార్ మహేష్ బాబుతో మాటలు కలిపాడు. రికార్డులు బ్రేక్ చేసే సత్తా కలిగిన ఈ దర్శకుడు… మహేష్ బాబుతో అతడు – 2 సినిమాని ప్లాన్ చేస్తున్నాడా…? మహేష్ తో త్రివిక్రమ్ రెగ్యులర్ గా టచ్ లో ఉంటున్నాడా… అవుననే అంటోంది టాలీవుడ్. దానికి తోడు రీసెంట్ గా జరిగిన నందిని నర్సింగ్ హోం ఆడియో రిలీజ్ కి గెస్ట్ గా వచ్చిన త్రివిక్రమ్… మహేష్ తో చాలా సేపు డిస్కషన్ చేశాడు. ఆడియో ఈవెంట్ జరుగుతున్నంత సేపూ ఇద్దరిమధ్య తెగ మాటలు నడిచాయి.

mahesh-trivikram-1

త్రివిక్రమ్ అతడు – 2 తీసే ప్లాన్ లో ఉన్నాడా..? మహేష్ బాబుతో ఆ విషయమే మాట్లాడాడా..? ఇది ఇప్పుడు ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతున్న హాట్ గాసిప్. ప్రస్తుతానికి మురుగదాస్ సినిమాతో మహేష్ బాబు బిజీగా ఉన్నాడు. అటు త్రివిక్రమ్ కూడా పవన్ కల్యాణ్ తో సినిమా కోసం వెయిటింగ్. సో.. వీళ్లిద్దరి కాంబోలో ముచ్చటగా మూడో సినిమా రావాలంటే ఇంకొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే. వీళ్లిద్దరి చివరి చిత్రం ఖలేజా.