ఫ్రెండ్ కోసం....

Wednesday,September 28,2016 - 10:28 by Z_CLU

టాలీవుడ్ స్నేహబంధాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ప్రత్యేకంగా కొందరి మధ్య ఈ బంధం అందర్నీ ఎట్రాక్ట్ చేస్తుంది. నిన్నటికినిన్న స్టూడెంట్ నంబర్-1 సినిమా వచ్చి 15 ఏళ్లు పూర్తయిన సందర్భంగా… ఎన్టీఆర్-రాజమౌళి తమ స్నేహాన్ని మరోసారి గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు అలాంటిదే మరో ఫ్రెండ్ షిప్ బాండ్ తెరపైకి వచ్చింది.

mahesh-sumanth-1

సుమంత్-మహేష్ బెస్ట్ ఫ్రెండ్స్ అనే విషయం చాలా తక్కువమందికి మాత్రమే తెలుసు. మహేష్ కుటుంబంతో అత్యంత సన్నిహితమైన సంబంధాలు కలిగి ఉన్న అతితక్కువ మందిలో సుమంత్ కూడా ఒకడు. అలాంటి ఫ్రెండ్ కోసం ప్రచారకర్తగా మారాడు మహేష్. సుమంత్ కొత్త సినిమా నరుడా.. డోనరుడా సినిమాకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు. ఆ సినిమా ట్రయిలర్ ను స్వయంగా మహేష్.. తన సోషల్ మీడియా ఎకౌంట్ లో విడుదల చేశాడు. తన బెస్ట్ ఫ్రెండ్ కోసం మహేష్ ఈ సినిమాకు ఇంకెంత ప్రమోషన్ కల్పిస్తాడో చూడాలి. నరుడా డోనరుడా సినిమాలో సుమంత్ డోనర్ గా నటిస్తే… సినిమా ప్రమోషన్ కు మాత్రం మహేష్ డోనర్ గా వ్యవహరిస్తున్నాడు.