ఈ సినిమా కోసం 18 ఏళ్లు వెయిట్ చేశాను

Wednesday,May 29,2019 - 01:27 by Z_CLU

దర్శకుడు శ్రీరాఘవ (సెల్వరాఘవన్)తో సినిమా చేయడం కోసం 18 ఏళ్లుగా వెయిట్ చేశానని ప్రకటించాడు హీరో సూర్య. ఎట్టకేలకు ఎన్జీకే (నంద గోపాల కృష్ణ)తో ఆ కోరిక తీరిందంటున్నాడు సూర్య. నిన్న జరిగిన ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో సూర్య పాల్గొన్నాడు.

నా జీవితంలో శ్రీరాఘవగారు స్పెషల్‌ పర్సన్‌. 18 ఏళ్లు ఆయనతో పని చేయాలని వెయిట్‌ చేశాను. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరూ వారి వ్యక్తిగత వ్యవహారాలను పక్కన పెట్టి వర్క్‌ చేశారు. శ్రీరాఘవగారు, యువన్‌ మ్యాజికల్‌ కాంబోలో వర్క్‌ చేయడం హ్యాపీగా ఉంది. ఓ సాధారణ వ్యక్తి రాజకీయ శక్తిగా మారి సమాజానికి ఎలా ఉపయోగపడ్డాడనేదే ఈ సినిమా

తన కెరీర్ లో ఎన్జీకే సినిమాను వెరీ వెరీ స్పెషల్ మూవీగా చెప్పుకొచ్చాడు సూర్య. ఈ సినిమా కోసం తన కెరీర్ లో ఏడాదిన్నర గ్యాప్ వచ్చిందంటున్నాడు.

నా గత చిత్రం విడుదలై ఏడాదిన్నర సమయం పట్టింది. మీలాగానే నేను కూడా శ్రీరాఘవగారికి పెద్ద ఫ్యాన్‌ని. అందుకే ఆయనతో ఈ సినిమా చేశాను. సినిమా చూసే ప్రేక్షకులకు ఇది యూనిక్‌ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇస్తుంది. ఈ సినిమా మా అందరికీ స్పెషల్‌ మూవీ.”

రకుల్, సాయిపల్లవి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా, మే 31న థియేటర్లలోకి వస్తోంది.