సమ్మర్ లో సందడి చేయనున్న సూర్య

Sunday,December 16,2018 - 03:31 by Z_CLU

సూర్య లేటెస్ట్ మూవీ ‘NGK’మరోసారి వాయిదా పడింది.. సెల్వరాఘవన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను ముందుగా సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకున్నారు. అయితే అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి కాకపోవడంతో ఈ సినిమాను సమ్మర్ కి వాయిదా వేసినట్లు తెలుస్తుంది. ఏప్రిల్ 14 న తమిళ ఉగాది సందర్భంగా ఈ సినిమాను రిలీజ్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు సమాచారం.

సూర్య సరసన సాయి పల్లవి, రకుల్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాను డ్రీం వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్.ఆర్ ప్రకాష్ బాబు , ఎస్.ఆర్.ప్రభు నిర్మిస్తున్నారు. యువన్ శంకర్ రాజా ఈ సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.