రీమేక్ సినిమాలో నాగశౌర్య?

Wednesday,May 29,2019 - 01:13 by Z_CLU

త్వరలోనే ఓ రీమేక్ ప్రాజెక్టులో నటించబోతున్నాడు నాగశౌర్య. ఈ మేరకు ఓ దర్శకుడితో చర్చలు ప్రారంభించినట్టు తెలుస్తోంది. తమిళ్ లో శివకార్తికేయన్ హీరోగా నటించిన ఓ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని అనుకుంటున్నాడట నాగశౌర్య

ప్రస్తుతం ఈ హీరో తన సొంత బ్యానర్ పై ఓ సినిమా చేస్తున్నాడు. మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాతో రమణ తేజ దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. ఈ సినిమా ఓ కొలిక్కి వచ్చిన వెంటనే రీమేక్ ప్రాజెక్టు డీటెయిల్స్ బయటకు రానున్నాయి.

రీసెంట్ గా కొన్ని ప్రాజెక్టుల నుంచి తప్పుకున్నాడు నాగశౌర్య. వాటి స్థానంలో ఈ రీమేక్ సినిమాను పట్టాలపైకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నాడు. దీన్ని కూడా తన సొంత బ్యానర్ పైనే నిర్మించే ప్లాన్ లో ఉన్నాడు. శివ కార్తికేయన్ నటించిన ఆ సినిమా తెలుగులో కేడీ బిల్లా కిలాడీ రంగ టైటిల్ తో డబ్ కూడా అయింది.