NGK ట్రయిలర్ రివ్యూ.. పక్కా మాస్

Tuesday,April 30,2019 - 02:00 by Z_CLU

సూర్య నుంచి ఓ సినిమా వస్తుందంటే అది ఏ జానర్ లో ఉంటుంది, సూర్య క్యారెక్టర్ ఎలా ఉంటుందనే విషయాల్ని ఊహించడం చాలా కష్టం. ఎందుకంటే ప్రతి సినిమాకు తనను తాను మార్చుకుంటూ ఎంతో కొత్తగా కనిపించడం సూర్య స్టయిల్. NGK మూవీ విషయంలో కూడా ఇదే రిపీటైంది.

NGK ట్రయిలర్ లో మాస్ కుర్రాడిగా, యూత్ లీడర్ గా, పొలిటీషియన్ గా ఇలా డిఫరెంట్ గెటప్స్ లో కనిపిస్తున్నాడు సూర్య. ఎప్పట్లానే యాక్షన్ ఇరగదీశాడు. ట్రయిలర్ లో సూర్య-సాయిపల్లవి పెయిర్ బాగుంది. సెల్వరాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఓ సీరియస్ పాత్రలో రకుల్ కనిపించనుంది. యువన్ శంకర్ రాజా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ట్రయిలర్ లో మెయిన్ ఎట్రాక్షన్.

కోలీవుడ్ లో సెల్వరాఘవన్ సినిమాలకు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. అలాంటి దర్శకుడితో స్టార్ హీరో సూర్య, ఫస్ట్ టైమ్ కలిసి వర్క్ చేస్తున్నాడు. అందుకే NGKపై అన్ని అంచనాలు. మే 31న థియేటర్లలోకి రానున్నాడు NGK అలియాస్ నందగోపాల కృష్ణ.