'వినయ విధేయ రామ' రిలీజ్ డేట్ ఫిక్స్ ?

Sunday,December 02,2018 - 02:04 by Z_CLU

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ ‘వినయ విధేయ రామ’ సంక్రాంతి కి రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.. సంక్రాంతి రిలీజ్ అంటూ ఇప్పటికే  ప్రమోషన్ మొదలుపెట్టేసిన మేకర్స్ ఇంత వరకూ రిలీజ్ డేట్ ని మాత్రం అనౌన్స్ చేయలేదు.  లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం ఈ సినిమా రిలీజ్ డేట్  ఖరారైనట్టు సమాచారం. ప్రస్తుతం ఒక సాంగ్ మినహా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను జనవరి 11 రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తోంది.

బోయాపాటి మార్క్ ఫ్యామిలీ & యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా ప్రశాంత్ , ఆర్యన్ రాజేష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. డి.వి.వి. ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై డి.వి.వి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.