మెగా హీరోతో రష్మిక ?

Sunday,December 02,2018 - 12:02 by Z_CLU

టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ రెండు హిట్స్ అందుకున్న రష్మిక లేటెస్ట్ గా మెగా ఆఫర్ అందుకుందని సమాచారం. మెగా హీరో వరుణ్ తేజ్ తో హరీష్ శంకర్ ఓ రీమేక్ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన రష్మిక ను హీరోయిన్ గా కన్ఫర్మ్ చేసారని తెలుస్తుంది..

హీరోయిన్ కి ఇంపార్టెన్స్ ఉండే క్యారెక్టర్ కావడంతో రష్మిక కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్. ప్రస్తుతం విజయ్ దేవర కొండ సరసన డియర్ కామ్రేడ్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది రష్మిక. ఆ సినిమా తర్వాత ఈ అమ్మడు చేసే సినిమా ఇదేనని టాక్.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా తమిళ్ లో సూపర్ హిట్ అయిన ‘జిగర్తాండ’ కు రిమేక్ గా తెరకెక్కనుందని సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అనౌన్స్ మెంట్ రానుంది.