హీరోయిన్ ను రిపీట్ చేస్తున్న విజయ్ దేవరకొండ

Monday,February 26,2018 - 05:53 by Z_CLU

మరో సినిమాకు రెడీ అవుతున్నాడు విజయ్ దేవరకొండ. పెళ్లిచూపులు సినిమాతో తనను హీరోగా నిలబెట్టిన బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్ పై, మైత్రీ మూవీ మేకర్స్ సహ-నిర్మాతగా ఈ సినిమా చేయబోతున్నాడు. భరత్ కమ్మ దర్శకుడు. ఈ ప్రాజెక్టులోకి రష్మికను హీరోయిన్ గా తీసుకున్నారు.

విజయ్ దేవరకొండ, రష్మిక కాంబోలో ఇది రెండో సినిమా. వీళ్లిద్దరూ కలిసి పరశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న గీతగోవిందం సినిమాలో నటించారు. ఆ మూవీ ఇంకా రిలీజ్ కాకుండానే భరత్ కమ్మ సినిమాతో రష్మికను రిపీట్ చేస్తున్నాడు విజయ్ దేవరకొండ.

ఈ నయా ప్రాజెక్టుకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించనున్నాడు. మే నుంచి ఈ కొత్త సినిమా సెట్స్ పైకి వస్తుంది. ప్రస్తుతం ఏ మంత్రం వేసావె, టాక్సీవాలా, గీతగోవిందం సినిమాల్ని కంప్లీట్ చేసి వాటి రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాడు విజయ్ దేవరకొండ.