మార్చి 1 న ‘నా పేరు సూర్య’ పోస్టర్ ఇంపాక్ట్

Monday,February 26,2018 - 07:31 by Z_CLU

అల్లు అర్జున్ మోస్ట్ అవేటెడ్ మూవీ ‘నా పేరు సూర్య’. వక్కంతం వంశీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం క్లైమాక్స్ షూటింగ్ పనుల్లో బిజీగా ఉంది. అయితే ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ ఇంపాక్ట్ టీజర్ తో పాటు రెండు సాంగ్స్ ని రిలీజ్ చేసి సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమా యూనిట్, మార్చి 1 న ఈ సినిమా పోస్టర్ ఇంపాక్ట్ ని రిలీజ్ చేయనుంది.

‘నా పేరు సూర్య’ ఫస్ట్ ఇంపాక్ట్ టీజర్ అల్లు అర్జున్ ని యాంగ్రీ మిలిటరీ మేన్ గా ప్రెజెంట్ చేసింది. స్టైలిష్ స్టార్ ని కొత్త అవతారంలో ప్రెజెంట్ చేసిన ఈ వీడియో ఇంపాక్ట్, ఒక్కసారిగా సినిమాపై నెక్ట్స్ లెవెల్ ఎక్స్ పెక్టేషన్స్ ని సెట్ చేసింది. ఆ క్రమంలో మార్చి 1 న రిలీజ్ కానున్న ఈ పోస్టర్ ఇంపాక్ట్ కూడా అదే తరహా బజ్ క్రియేట్ చేస్తుంది.

మే 4 న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ కీ రోల్ ప్లే చేస్తున్నాడు. అనూ ఇమ్మాన్యువెల్ హీరోయిన్. విశాల్–శేఖర్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమాని లగడపాటి శ్రీధర్ నిర్మిస్తున్నారు.